Another Twist in Beautician suspicious death బ్యూటీషియన్ పై అత్యాచారం.. శిరీషపై ఎస్ఐ అత్యాచారం..?

Kukunoor si behind beautician suspicious death

banjara hills, film nagar, RJ photography, prabhakar reddy, kukunoor police station, shirisha, sub inspector, sucide, beautician, beautician suspicious death, beautician in a city-based, Beautician death mystery, telangana, crime

another twist in beautician suspicious death, if sources are to be believed kukunoor sub inspector prabhakar reddy who shot himself is behind the sucide case of beautician shirisha.

బ్యూటీషియన్ పై అత్యాచారం..? ఎస్ఐ సూసైడ్ కేసులో ట్విస్టు..?

Posted: 06/14/2017 06:31 PM IST
Kukunoor si behind beautician suspicious death

త‌న స‌ర్వీసు రివాల్వర్ తో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం కుక్కునూరు ఎస్సై ప్రభాక‌ర్ రెడ్డి కేసులో మరో ట్విస్టు చోటుచేసుకుంది. ప్రభాకర్ రెడ్డికి ఫిల్మ్‌ నగర్‌లో  అనుమానాస్పదంగా మృతి చెందిన‌ బ్యూటీషియన్ శిరీష అనుమానాస్పద మృతికి మధ్య లింకు వుందని తెలుస్తుంది. ఎస్ఐ అత్మహత్యకు, శిరీష అనుమానస్పద మృతికి మధ్య సంబంధం వుందన్న ఆరోపణలు వినబడుతున్నాయి. ప్రభాక‌ర్ ఆత్మహ‌త్య కేసులో విచార‌ణ ప్రారంభించిన‌ పోలీసులు.. శిరీష అనుమానస్పద కేసుతోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారన్న విషయాన్ని తెలుసుకున్నారని సమాచారం.

అయితే ఎస్ఐ ప్రభాకర్ రెడ్డికి శిరీషకు మధ్య గత కొంతకాలంగా పరిచయం ఉందని, ఈ క్రమంలో ఆయన అమెను కలుసుకునేందుకు బంజారాహిల్స్ ఫిల్మనగర్ లోని శీర్షష కార్యాలయానికి వచ్చాడని తెలుస్తుంది. అమెతో మాట్లాడుతున్న సందర్భంగా మద్యం సేవించి వున్న ప్రభాకర్ రెడ్డి.. అదే మత్తులో శిరీషపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపణలు వ‌స్తున్నాయి. శిరీష ఆత్మహత్య వ్యవహారం బయటకు రావడంతో ఈ కేసు త‌న మెడ‌కు చుట్టుకుంటుద‌న్న భ‌యంతోనే ఎస్‌ఐ కూడా ఆత్మహ‌త్యకు పాల్పడ్డాడ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు.
 
ఇక ఇటు బంజారాహిల్స్ పోలీసులు కూడా శిరీష అనుమానాస్పద కేసులో వేగంగా దర్యాప్తును ప్రారంభించారు. ఆర్‌జే ఫొటోగ్రఫీ లో అనుమానాస్పదంగా మరణించి వున్న శిరీష ఎలా మరణించింది..? అమె ఆత్మహత్య చేసుకుందా..? లేక హత్య చేశారా..? అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించిన అధికారులకు అమై అత్యాచారం చేయబడిందన్న విషయం కూడా తెలిసి ఆర్‌జే ఫొటోగ్రఫీ సంస్థ యజమాని అయిన రాజీవ్‌, అతని స్నేహితుడు శ్రావణ్‌ల‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. వారిద్దరితో శిరీష‌కు వివాదాలు ఉన్నాయని పోలీసులు తేల్చారు. వారి మధ్య నిన్న తెల్లవారుజామున రెండున్నర వరకూ గొడ‌వ జ‌రిగింద‌ని తెలుసుకున్నారు.

రాజీవ్‌ను విచారించిన పోలీసులకు అతని నుంచి వేర్వేరు సమాధానాలు రావడంతో.. వారే హత్యచేశారా..? అన్న కోణంలో పోలీసులు విచారణ సాగింది. తొలుత శిరీష ఫ్యాన్‌కు ఉరేసుకుందని తానే చున్నీని కత్తిరించి మంచం మీద పడుకోబెట్టానని చెప్పిన రాజీవ్.. తరువాత అమె బాత్రూంలో ఆత్మహత్య చేసుకుందని రెండోసారి చెప్పాడు. దీంతో అనుమానాలు బలపడిన పోలీసులు అతడి స్నేహితుడు శ్రావణ్ ను వేరుగా విచారించారు. దీంతో ఎస్ఐ ప్రభాక‌ర్ రెడ్డి వ్యవ‌హారం బ‌య‌ట‌కు వ‌చ్చింద‌ని తెలుస్తుంది. అటు మెదక్ పోలీసులు కూడా ఈ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య కేసులో బంజారాహిల్స్ పోలీసులతో కలసి సంయుక్తంగా చేధించే పనిలో పడ్డారు.

శిరీష మరణించిన రోజు అర్థరాత్రి ఏం జరిగింది.? ఎస్ఐ ప్రభాకర్ రెడ్డికి.. శిరీష మధ్య సంబంధమేంటి.? అసలు వారికదద్దరికీ ఏన్నాళ్లుగా పరిచయముంది..? శిరీషపై ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి నిజంగానే అత్యాచారానికి పాల్పడ్డాడా..? రాత్రి ఎనమిదిన్నర గంటలకు ఇంటికి వస్తాన్న భార్య ఇంటికి రాకపోతే భర్త ఏం చేశాడు.? భర్తకు వీరిద్దరి మధ్య వున్న పరిచయం తెలుసా..? రాత్రి అర్జే ఫోటోగ్రాఫీకి వెళ్లిన ఎస్ఐ ఎక్కడ మద్యం సేవించాడు..? మరి అసయమంలో యజమాని రాజీవ్ ఎక్కడున్నాడు..? శిరీష అనుమానాస్పద మృతి చెందిందా..? లేక హత్య చేశారా..? ఇవన్నీ అనుమానాలను పోలీసుల దర్యాప్తు నివృత్తి చేయాల్సి వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles