SI Beautician's Death Case Solved by Police

Sirisha prabhakar reddy case key clues

Beautician Death, Beautician Mystery Case, Sirisha Prabhakar Reddy, SI Prabhakar Reddy, Prabhakar Reddy Suicide, Rajeev and Shravan, Rajeev Vallabaneni Sirisha, Sirisha aka Vijayalaxmi, Beautician Murder case, Sirisha Prabhakar Reddy Case, DSP Press Meet Sirisha Prabhakar Reddy Case

After Investigate Rajeev and Shravan Sirisha's Death Mystery Solved. Sirisha's body bore injury marks in Postmortem report.

'శిరీష- ప్రభాకర్‌ రెడ్డి' కేసు మిస్టరీ వీడిందా?

Posted: 06/16/2017 09:28 AM IST
Sirisha prabhakar reddy case key clues

బ్యూటీషియన్ శిరీష పోస్టుమార్టమ్ రిపోర్టు లో ఆమె మెడ ఎముక విరిగి చనిపోయినట్లు తేలింది. ఆమె శరీరంపై గాయాలున్నాయి. కంటి మీద, పెదవులపైన, తలపైన గాయాలయ్యాయి. పెనుగులాడినట్లు ఆనవాళ్లు కనబడుతున్నాయి. దీన్నిబట్టి చూస్తుంటే ఆమెను హత్య చేసి, ఉరి వేసుకున్నట్లు చిత్రీకరించారన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. రాజీవ్, శ్రవణ్ ల సమాధానాలు కూడా పొంతన లేకపోవటం తో ఆ అనుమానాలు మరింత బలపడ్డాయి కూడా.

ఇదిలావుంటే రాజీవ్-శిరీష్‌ల మధ్య సన్నిహిత సంబంధం వున్నదంటూ తేజస్విని అనే యువతి బంజారాహిల్స్ పోలీసు స్టేషనులో కేసు పెట్టినట్లు బయటకొచ్చింది. తేజస్విని అనే యువతి రాజీవ్ ను పెళ్లాడాలనుకున్నదనీ, ఐతే అప్పటికే పెళ్లయిన శిరీష-రాజీవ్ సన్నిహితంగా వున్నట్లు అనిపించడంతో ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి కేసు వరకూ వెళ్లిందంటున్నారు. ఈ కేసును పరిష్కరించుకునేందుకు బంజారాహిల్స్ పోలీసు స్టేషనుకు వెళ్లగా మరో రెండు రోజుల తర్వాత చూద్దాం అని అక్కడి పోలీసులు చెప్పి పంపారని బయట పడింది.

ఇక రాజీవ్ వ్యవహార శైలి మొదటి నుంచే కాస్త తేడా అని స్థానికులు చెప్పటం విశేషం. రాజీవ్ ది నేరస్వభావమని, అతడిది ప్లేబోయ్ మనస్తత్వమని, తరచు గర్ల్ ఫ్రెండ్స్ ను మార్చేవాడని వారంటున్నారు. అంతేకాదు తేజస్వినితో ప్రేమలో పడి శిరీషను వదిలించుకునే ప్రయత్నం కూడా చేశాడని చెబుతున్నారు. గతంలో కూడా శిరీషతో రాజీవ్ ఘర్షణ పడ్డాడని గుర్తించారు. ఆ అపార్ట్ మెంట్ చుట్టూ సీసీ కెమెరాలు అమర్చారని తెలిపారు.

శిరీష(28) మంగళవారం ఆత్మహత్య చేసుకున్న కొన్ని గంటలకే సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణం పాలయ్యారు. ఈ రెండు ఘటనలకు సంబంధముందని అనుమానించిన పోలీసుల వద్ద ఇప్పుడు స్పష్టమైన ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. శిరీషను కుకునూరుపల్లికి తీసుకెళ్లినట్లు స్పష్టంగా తెలుస్తుండగా, అక్కడ ఏం జరిగిందన్నది వెల్లడి కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శిరీష ఆత్మహత్యపై శుక్రవారం అధికారికంగా వివరాలు వెల్లడిస్తామని డీసీపీ వెంకటేశ్వరరావు చెప్పటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Beautician Sirisha  SI Prabhakar Reddy  Death Mystery  

Other Articles