4.4 Magnitude Earthquake jolts Imphal

Earthquake hit manipal again

Earthquake, North India Earthquake, Earthquake Imphal, Mnaipur Earthquake, 4.4 Magnitude, North India Earthquake, Jolts Imphal, North India Earthquake

Earthquake of 4.4 magnitude hits Imphal, no casualties so far. Since last year, the north eastern part of the country especially Manipur has been continuously facing the outrage of earthquakes.

గాఢనిద్ర నుంచి ఉరుకులు, పరుగులు...

Posted: 06/19/2017 08:51 AM IST
Earthquake hit manipal again

గతేడాది నుంచి ఉత్తర భారతంలో ముఖ్యంగా ఈశాన్య ప్రాంతంలో వరుసగా భూ ప్రకంపనలతో వణికిపోతున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అదే జరిగింది. సోమవారం వేకువ ఝామున మణిపూర్ రాజధాని ఇంఫాల్ ను భూకంపం పలకరించింది.

ఈ పొద్దున ఉదయం 4.05 నిమిషాలకు స్వల్ఫ ప్రకంపనలు తాకాయి. అయితే ఒక్కసారిగా కాళ్ల కింద భూమి కంపించిపోవడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. గాఢ నిద్రలో ఉన్న వాళ్లంతా భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఈ భూకంపం తీవ్రత కేవలం 4.4గా రిక్టర్ స్కేలుపై నమోదైందని, ఇది పెద్ద భూకంపం కాదని నిపుణులు పేర్కొన్నారు.

పలుమార్లు భూమి కంపించడంతో ఈ రాష్ట్రంలో ప్రజలు నిద్రలేకుండా బయటే గడిపినట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. నాలుగు రోజుల క్రితం చూరచంద్ పూర్ లో కూడా ఇలాగే ప్రకంపనలు వచ్చాయి. ప్రస్తుతం భూకంప కేంద్రం జమ్ము కశ్మీర్ సరిహద్దు చంబాలో కేంద్రీకృతమైనట్లు తెలుస్తోంది. జూన్ 1, మే 06న, ఏప్రిల్ 21న ఇలా... ఈ యేడాదిలో డజను పైగానే ఘనటలు సంభవించడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Earthquake  Manipur  Imphal  4.4 Magnitude  

Other Articles