Youth kisses woman waiting at bus stop బస్టాప్ లో నిల్చున్న యువతికి ముద్దపెట్టి..

Youth kisses woman waiting at bus stop

Youth kisses woman waiting at bus stop, Youth kisses woman jeevan bima nagar, Youth kisses woman bengaluru, Youth kisses woman banglore, harrassment on women, north east woman, bangalore, sexual assault on woman, karnataka, crime

An unidentified youth kissed a 21-year-old woman and ran away while she was waiting for a bus in Jeevan Bima Nagar in Bengaluru

బస్టాప్ లో నిల్చున్న యువతికి ముద్దుపెట్టి...

Posted: 06/20/2017 11:46 AM IST
Youth kisses woman waiting at bus stop

మహిళల భద్రతకు రక్షణ కరువైంది. ఇంటా.. బయట.. ఆఫీస్ ఇలా ఎక్కడ పడితే అక్కడ లైంగిక వేధింపుల పర్వాలు కొనసాగుతూ ఉన్నాయి. పేరుకే ఐటీ హబ్ అయినప్పటికీ బెంగళూర్ లో జరిగే అఘాయిత్యాల గురించి తెలిసిందే కదా. కొత్త సంవత్సరం జరిగిన సాముహిక కీచక పర్వం దగ్గరి నుంచి ఇప్పుడు చెప్పుకోబోయే రెండు ఘటనల దాకా సమాధానం లేని ప్రశ్నలనే మిగులుస్తున్నాయి.

తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి బీహార్ కు చెందిన 24 ఏళ్ల ఓ యువతి శనివారం ఓ స్నేహితుడి ఇంట్లో పార్టీ చేసుకుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ సేఫ్ కాదన్న ఉద్దేశంతో క్యాబ్ బుక్ చేసుకున్నారు. జేబీనగర్ బస్టాప్ వద్ద వేచి ఉండగా దారుణం జరిగింది. ఓ బ్లాక్ షర్ట్ వేసుకున్న ఆగంతకుడు అక్కడకు వచ్చి, ఒక్కసారిగా ఆమెపై ముద్దుల వర్షం కురిపించాడు. ఆ సమయంలో బాయ్ ఫ్రెండ్ మొబైల్ ఫోన్ బిజీగా ఉన్నాడు. జరుగుతున్న వ్యవహారం నుంచి వారు తేరుకునేలోపే తన పనికానిచ్చేసి ఆగంతుకుడు పరారయ్యాడు. ఈ ఘటనపై వారిద్దరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అడ్డుకుని మరీ అసభ్యంగా...

 

అదంతా యువతి ఆడిన డ్రామానే!

 

తేనేటీగ వాలిందంటూ...

మరో ఘటనలో ఓ టెక్కీ యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఓ చిరు వ్యాపారస్థుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందిరానగర్ లోని సీఎంహెచ్ రోడ్డులో ఓ ప్రైవేట్ కంపెనీలో బాధితురాలు పని చేస్తోంది. గత గురువారం సాయంత్రం ఆఫీస్ కు వెళ్లేందుకు కింది ఫ్లోర్ లో లిఫ్ట్ కోసం వేచి ఉంది. ఇంతలో అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి తనపై తేనే తీగ వాల్లిందని చెబుతూ దాన్ని తరిమే యత్నమంటూ తడమసాగాడు. విషయం అర్థమైన యువతి పారిపోయేందుకు యత్నించగా, గట్టిగా వాటేసుకుని అసభ్యంగా ప్రవర్తించాడంట. ఒక్కసారిగా అరిచే యత్నం చేయటంతో అతను అక్కడ నుంచి పారిపోయాడు.

యువతి ఫిర్యాదు చేయటంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ పుటేజీ ఆధారంగా హెచ్ఏఎల్ మార్కెట్ లో టమోటాలు అమ్ముకునే మురళి(35) అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. కాగా, ఒంటరిగా ఉన్న అమ్మాయిలపై బొమ్మ బల్లులను వేస్తూ లైంగికంగా వేధించే ఓ గ్యాంగ్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : unidentified youth  kisses  busstop  jeevan bima nagar  karnataka  crime  

Other Articles