Opposition Picks Meira Kumar As Their Presidential Candidate విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా మాజీ లోక్ సభ స్పీకర్

Opposition picks meira kumar as their presidential candidate

Meira Kumar vs Ram Nath Kovind, opposition, presidential election, prezpoll, opposition candidate, meeting, jdu, crack, meriakumar, who wlll be congress presidential candidate, Meira Kumar, Ram Nath Kovind, NDA, Opposition, congress, president candidate, sonia gandhi

Non-NDA parties have chosen Meira Kumar as their presidential nominee hours ahead of a crucial opposition meeting where they were expected to zero in on a joint candidate for the presidential election.

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా మాజీ లోక్ సభ స్పీకర్

Posted: 06/22/2017 05:45 PM IST
Opposition picks meira kumar as their presidential candidate

ఎన్డీఏ పార్టీ తమ రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్ నాథ్ కోవింద్ ను ప్రకటించిన నేపథ్యంలో.. కాంగ్రెస్ కూడా అదే సామాజికవర్గానికి చెందిన మహిళా నేత, మాజీ లోక్ సభ స్పీకర్, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీరాకుమార్ ను తమ రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దింపింది. తాము గతంలోనే అనగారిన సామాజికవర్గాల ప్రజల తరుపున దేశ అత్యున్నత పదవికి తమ అభ్యర్థిగా కేఆర్ నారాయణన్ ను పంపామని చెప్పుకోచ్చిన కాంగ్రెస్ మరోమారు కూడా అదే అనగారిన వర్గానికి చెందిన మహిళా నేతను అత్యున్నత పదవికి ఎంపిక చేసింది.
 
దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ కుమార్తె అయిన మీరాకుమార్ ను ఇదివరకే లోక్ సభ స్పీకర్ చేసిన కాంగ్రెస్.. ఇక తాజా సామాజిక, రాజకీయ సమీకరణల నేపథ్యంలో అమెను తమ రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో దింపింది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా జరిపిన విపక్షాల సమావేశంలో ఎట్టకేలకు మీరాకుమార్ పేరును ప్రతిపాదించారు. అన్ని పార్టీలు అంగీకారం తో ఇక అమె తమ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థి అని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఇవాళ సాయంత్రం ప్రకటించారు. కాగా మీరాకుమార్ ఈ నెల 27 లేదా 28న రాష్ట్రపతి పదవికి తమ నామినేషన్ దాఖలు చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Meira Kumar  Ram Nath Kovind  NDA  Opposition  congress  president candidate  sonia gandhi  

Other Articles