దక్షిణాది ప్రజల వంటకాల్లో అతిపురాతనంగా వస్తున్న వంటకం.. ఉప్మా. కొత్తదనానికి తగ్గట్టుగా ఉప్మా పెసరట్టు. జీడిపప్పు ఉప్మా. ఉప్మా దోస. ఇలా ఏ ఫలహారపు వంటలోనైనా అలా చేరి నోటికి రుచిని, దేహానికి శక్తిని ఇచ్చే వంటకం ఉప్మా అంటే అతిశయోక్తి కాదు. దేశ ప్రజలకు ఎంతగానో ఇష్టపడే ఉప్మాకు ఇప్పుడు అంతర్జాతీయ ప్రాముఖ్యత లభిస్తున్నది. అదెలా అంటే.. ఉప్మాను జాతీయ వంటకంగా ప్రకటించాలంటూ జోరుగా ప్రచారం సాగుతున్నది. ఈ ప్రచారం సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ వేదికగా ప్రారంభమైంది.
ప్రముఖ భారతీయ చెఫ్ లైనా ఫ్లాయిడ్ కార్డోజ్, ఆరతి సంపత్ ల కారణంగా అమెరికాలో కూడా డిష్‌కు ఎంతో పేరు వచ్చింది. ఉప్మాకున్న ప్రత్యేక గుణమేమంటే ఎలా చేసినా బాగుంటుంది. కొందరు ఉప్మాను పొపు గింజలు, మసాలదినుసులు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చి మిరపకాయలు, ఉల్లిపాయలతో సాదా సీదాగా చేస్తే, మరికొందరు పల్లీలు, కాజు, బఠానీలు జోడిస్తారు. ఇంకొందరు వాటికి టమోటా, బీన్స్, పుట్టగొడుగులు కలిపి చేస్తారు. కొందరు మామూలు నూనెతో చేస్తే మరికొందరు నెయ్యితో చేస్తారు. పచ్చి కొబ్బరి పాలతో కూడా చేస్తారు. ఇంకొందరు మాంసం, చేపలతో ఉప్మా తయారు చేస్తారు.
తమిళ నటుడు, దర్శకుడు రాధాకష్ణన్ ప్రతిబన్ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉప్మాను జాతీయ వంటకంగా ప్రకటిస్తే బాగుంటుందని మొదట ప్రతిపాదించారు. తాను సహాయ దర్శకుడిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టినప్పుడు కాలే కడుపును ఉప్మాతో ఎలా నింపుకుని అకలిని తీర్చుకున్నారో చెప్పారు. ఆ రోజుల్లో ఎంతోమంది సహాయ దర్శకులు ఆర్థిక స్థోమత అంతగాలేక ప్రతిరోజూ ఉప్మాతోనే జీవించే వారని కూడా చెప్పాడు. ఇప్పుడు కూడా సినీ పరిశ్రమలో ఆ పరిస్థితి ఉందని చెబుతారు. ఆయన సరదాగా అన్న మాటాలు కాస్తా ఏకంగా ఉద్యమంగా మారుతున్నాయి. ఉప్మాను జాతీయ వంటకంగా ప్రకటించాలని ఏకంగా ట్విట్టర్ వేధికగా సామాజిక ఉద్యమం ప్రారంభమైంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more