NDA Candidate Ramnath Kovind files nomination అతిరధుల సమక్షంలో ఒక ఘట్టం ముగించిన రామ్ నాథ్

Presidential poll nda candidate ramnath kovind files nomination appeals for support

bharatiya janta party,kovind files nomination,meira kumar,National Democratic Alliance,ramnath kovind,ramnath kovind files nomination,who is ramnath kovind,yogi on kovind's nomination, nda,nomination,poll,meira kumar,july 17,new delhi,bharatiya janta party presidential candidate ramnath kovind,shri ram nath kovind

Bharatiya Janta Party Presidential Candidate Ramnath Kovind filed his nomination for the upcoming polls for 15th Presidential Elections of India which would be conducted in the country on July 17.

అతిరధుల సమక్షంలో ఒక ఘట్టం ముగించిన రామ్ నాథ్

Posted: 06/23/2017 12:56 PM IST
Presidential poll nda candidate ramnath kovind files nomination appeals for support

దేశ అత్యున్నత రాష్ట్రపతి పదవికి జరుగుతున్న ఎన్నికలలో ఎన్డీయే అభ్యర్థిగా రామ్ నాథ్‌ కోవింద్ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. పార్లమెంట్ భవనంలో ఆయన ఎన్డీఏ భాగస్వామ్య ఫక్షాల నేతలు, బీజేపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు సమక్షంలో తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీయే ముఖ్యనేతలంతా హాజరయ్యారు. నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపి అగ్రనేతలు ఎల్ కే అడ్వాణీ, అమిత్ షా, మురళీమనోహర్ జోషీ, వెంకయ్యనాయుడు, సుష్మాస్వరాజ్‌, నితిన్ గడ్కరీలు పాల్గోన్నారు.

వీరితో పాటు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్‌, తమిళనాడు సీఎం పళనిస్వామి, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్, హర్యాన ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తదితరులు పాల్గొన్నారు. మొత్తం నాలుగు నామినేషన్‌ పత్రాలు దాఖలు చేయగా.. రామ్‌నాథ్‌ను ప్రతిపాదిస్తూ తొలి నామినేషన్‌ పత్రంపై ప్రధాని నరేంద్ర మోదీ, రెండో పత్రంపై అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, మూడో నామినేషన్‌ పత్రంపై బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, నాలుగో పత్రంపై అకాళీదళ్‌ అధినేత ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ సంతకాలు చేశారు.

అత్యున్నత పదవికి మరింత వన్నెతీసుకోస్తా: రామ్ నాథ్

దేశ అత్యున్నతమైన రాష్ట్రపతి పదవికి మరింత వన్నె తీసుకోచ్చేందుకు తాను ప్రయత్నిస్తానని రామ్ నాథ్ కోవింద్ అన్నారు. అధికార ఎన్డీఏ అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్‌ దాఖలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రపతి అభ్యర్థిగా తనకు మద్దతుగా నిలిచిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అధికార పార్టీ అశించిన స్థాయిలోనే తన పనితీరు వుంటుందని, దానిని మరింత మెరుగుపర్చుకునేందుక కూడా యత్నిస్తానని చెప్పారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : presidentianl poll  ramnath kovind  PM modi  Amit shah  lk advani  election commission  new delhi  

Other Articles