అమ్మాయిలంటేనే అంగడి వస్తువుగా భావించే మగమృగాలు కంటికి నచ్చిన అమ్మాయిలపై లైంగిక వేధింపులకు పాల్పడేందుకు అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. గతంలో కన్యాశుల్కం పేరుతో పేద అమ్మాయిల తల్లిదండ్రులకు ధనాశ చూపి అమ్మాయిలను తమ కట్టుబాసినలుగా మార్చుకునే పురుషాహంకార సమాజంలో ఎందరో సంఘసంస్కర్థల పోరాట ఫలితంగా అది కాస్తా సమాజం నుంచి వెళ్లిపోయింది. అయితే దాని స్థానంలో వరకట్నం వచ్చి చేరడంతో .. ఇక పేదింటి అమ్మాయిలను అంగడి వస్తువులుగా చూసే దుర్ధినాలు పోయాయని అందరూ భావించారు.
కాని కావరంతో విర్రవీగుతున్న కామంధులున్న సమాజంలో మళ్లీ అలాంటి దుర్ధినాలు వస్తున్నాయి. పేద అమ్మాయిలపై కన్నువేసి వారి తల్లిదండ్రులకు డబ్బు అశ చూసి రెండో పెళ్లి పేరుతో నిట్టనిలువునా అన్యాయం చేస్తున్నారు. మొదటి భార్యతో సంసారం చేస్తూనే పగలు మాత్రం దొంగచాటుగా రెండో భార్య వద్దకు వచ్చి అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటన అలస్యంగా వెలుగుచూసింది. పెళ్లి పేరుతో నమ్మించి 16 ఏళ్ల బాలికను 40 ఏళ్ల వ్యక్తి నిర్బంధించి అత్యాచారానికి పాల్పడిన ఘటన తమిళనాడులోని నాగర్ కోవిల్ లో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. నాగర్ కోవిల్ లో రాబర్ట్ బెల్లార్మిన్ అనే పెళ్లి పేరుతో మైనర్ బాలికను రెండో వివాహం చేసుకున్నాడు. అమెను గురుసడి ప్రాంతంలోని ఓ ఇంట్లో ఉంచి కేవలం పగటి పూట మాత్రం తరచూ ఇక్కడికి వచ్చివెళుతున్నాడు. బాలిక ఎక్కడికైనా పారిపోతుందని భావించిన మృగాడు అమెను ఇంట్లోనే వుంచి బయట నుంచి తాళం వేసి నిర్భందించాడు. బాలిక దాదాపు 40 రోజులుగా ఒంటరిగా ఉంటోంది. ఆ నోటా ఈ నోటా సందేహాలు వ్యక్తం కావడంతో విషయం ఏంటో తెలుసుకునేందుకు రంగంలోకి దిగిన గ్రామపెద్దలు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు బాలికను విచారించగా అసలు విషయాలు బయటపడ్డాయి. రాబర్ట్ బెల్లార్మిన్కు ఇదివరకే వివాహమైందని.. తమది పేదకుటుంబం కావడంతో లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి తిరుచెందూరులోని ఒక దేవాలయంలో తనకు ఇష్టం లేకపోయినా పెళ్లి పేరుతో దండలు మార్చుకున్నామని బాధితురాలు పేర్కొంది. తర్వాత తీసుకొచ్చి ఇక్కడ ఉంచారని, 40 రోజులుగా తనపై అత్యాచారం చేస్తున్నాడని బాధితురాలు తన అవేదనను పోలీసుల ఎదుట వ్యక్తం చేసింది.
కన్యాకుమారి జిల్లాలోని పల్లంతురాయ్ ప్రాంతానికి చెందిన నిందితుడు రాబర్ట్ బెల్లార్మిన్ కి తాజా సమాచారం అందటంతో అతను పరారీలో వున్నాడని పోలీసులు తెలిపారు. అయితే నిందితుడి కోసం పోలీసులు వేటను ప్రారంభించి.. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కాగా బాధితురాలిని తల్లిదండ్రుల వద్దకు పంపాలా..? వద్దా అన్న అంశమై కూడా తీవ్ర చర్చ జరుగుతుంది. అయితే జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారులు మాత్రం బాలికను తంజావూరులోని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఆ బాలికకు వైద్య పరీక్షలు అందించాలని సంరక్షణ కేంద్రం నిర్వాహకులకు సూచించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more