Railways earned Rs 1407 crore via cancellation of reserved tickets టిక్కెట్ రద్దుతో రైల్వేకు ఇంత అదాయమా..?!

Railways earned rs 14 07 billion via cancellation of reserved tickets

train ticket cancellation,ticket cancellation charges,ticket cancellation,Railways earning,Passenger Reservation System,indian railways revenue,Indian Railways,Centre for Railway Information Systems

Indian Railways earned Rs 1407 crore billion just through the money charged on cancellation of reserved tickets, 25.29% more than their respective earning from last year.

టిక్కెట్ రద్దుతో రైల్వేకు ఇంత అదాయమా..?!

Posted: 06/29/2017 05:46 PM IST
Railways earned rs 14 07 billion via cancellation of reserved tickets

రైలు ప్రయాణం చేయాలంటే ముందస్తుగా టిక్కెట్లు రిజర్వ్‌ చేసుకోడం సాధారణమైన విషయం. తీరా ప్రయాణ తేదీ సమీపించగానే ఏదో కారణంలో ప్రయాణాన్ని రద్దు చేసుకుంటారు. అయితే ముందుగా రిజర్వు చేసుకున్న టిక్కెట్ల క్యాన్సిలేషన్ చేసుకుంటారు. ఇలా కాన్సిల్ చేసుకున్నవారి టిక్కెట్లలో కొంత రైల్వే శాఖ తీసుకుని కొంత ప్రయాణికులకు తిరిగి చెల్లిస్తుంది. అయితే ఇలా ఒక్క ఏడాదిలో పోగైన అదాయం ఎంతో తెలుసా..? షాకవ్వకండే.. ఏకంగా రూ. 1407 కోట్లు. నిజమండీ ఒక్క 2016-17 ఆర్థిక సంవత్సరంలో టిక్కెట్ల క్యాన్సిలేషన్‌ ద్వారా ఈ ఆదాయాలు ఆర్జించినట్టు రైల్వేశాఖ పేర్కొంది.

రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టు కింద సహ కార్యకర్త చంద్రశేఖర్ గౌడ్ కోరిన సమాచారం మేరకు సెంట్రల్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్ ‌(సీఆర్‌ఐఎస్) ఈ వివరాలను వెల్లడించింది. గౌడ్ కు ఇచ్చిన సమాధానంలో.... 2016-17 ఆర్థిక సంవత్సరంలో టిక్కెట్‌ క్యాన్సిలేషన్ ద్వారా రూ.14.07 బిలియన్ల ఆదాయాలను పొందామని రైల్వేశాఖ పేర్కొంది. అంతేకాక 2015-16లో ఇవి రూ.11.23 బిలియన్లుగా ఉన్నట్టు కూడా తెలిపింది. గతేడాది కంటే ఈ ఏడాది అర్జించిన ఆదాయం 25.29 శాతం అధికమని తెలిపింది. ఈ సమాచారమంతా ప్యాసెంజర్ రిజర్వేషన్ సిస్టమ్ కింద తనకు అందించిందని గౌడ్‌ చెప్పారు.
 
కేవలం రిజర్వు చేసుకున్న టిక్కెట్ల క్యాన్సిలేషన్ ద్వారా మాత్రమే కాక, రిజర్వు కాని టిక్కెట్ల క్యాన్సిలేషన్ తో కూడా రైల్వే ఆదాయాలను ఆర్జిస్తుంది. ఇక అన్ రిజర్వుడ్‌ టిక్కెటింగ్ సిస్టమ్ ‌(యూటీఎస్‌) ద్వారా 2016-17లో రూ.17.87 కోట్లను పొందినట్టు ఆర్టీఐ సమాధానంలో తెలిపింది. ఈ మొత్తం 2015-16లో రూ.17.23 కోట్లు, 2014-15లో రూ.14.72 కోట్లు ఉంది.  రైల్వే ప్యాసెంజర్ నిబంధనలు 2015 కింద అదే ఏడాది నవంబర్లో క్యాన్సిలేషన్‌ టిక్కెట్ల మొత్తాన్ని రీఫండ్ చేసే నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చారు. క్యాన్సిలేషన్ ఫీజులను రెండు సార్లు పెంచారు. ప్రయాణికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రైల్వే, రీఫండ్ రూల్స్‌ను మార్చాలని గౌడ్ డిమాండ్ చేస్తున్నారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RTI  Railways  Railway Information Systems  Ministry of Railways  chandrashekhar gaud  

Other Articles