Surrounded by Lions Gujarat Woman delivers baby

Woman delivers baby between lions

Gujarat, Gujarat Lions, Woman Birth Baby Lions, Curious Lions Woman Birth, Woman Delivered Baby Lions, Lions Surrounded Ambulance, Lions Ambulance, Gujarat Lions on Road, Jafrabad Lions Incident, Manguben Makwana Lion Baby, Woman Birth Child in Ambulance, Lion Baby in Gujarat, Simhaputrudu Birth

In Gujarat, Woman Delivers Baby In Ambulance Surrounded By 12 Lions. While the EMT contacted a physician over phone to take directions, the pride of lions, sensing human presence, emerged from the nearby bushes and surrounded the ambulance.Manguben Makwana giving birthday to a Baby Boy and both are hale and hearty.

గుజరాత్ లో సింహపుత్రుడి జననం

Posted: 07/01/2017 09:10 AM IST
Woman delivers baby between lions

గుజరాత్ కు చెందిన 32 ఏళ్ల మాంగుబెన్ మక్వానా అనే మహిళ జన్మలో జూన్ 29వ తేదీని మరిచిపోలేదేమో. ఆ రోజే ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. మాతృత్వం ఒక్కటే ఆ తేదీని ఆమె గుర్తుంచుకునేందుకు కారణం కాలేదు. ఆమెకు జరిగిన ప్రసవమే ఇక్కడ అసలు టాపిక్. ఏకంగా 12 సింహాల మధ్యే ఆమె బిడ్డకు జన్మనివ్వటం ఇక్కడ విశేషం.

అమెరేలి జిల్లా జఫ్రాబాద్ తాలుకా లున్సాపూర్ గ్రామానికి చెందిన మక్వానాకు గర్భంతో ఉంది. గురువారం రాత్రి ఆమెకు నొప్పులు రావటంతో 108 సాయంతో జఫ్రాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించే యత్నం చేశారు. అయితే గ్రామం నుంచి మూడు కిలోమీటర్లు దాటే సరికి ఒక్కసారిగా ఆంబులెన్స్ డ్రైవర్ ఆగిపోయాడు. లోపల ఉన్న వైద్య సిబ్బంది ఏమైందా అని బయటకు తొంగి చూశారు. అంతే వాళ్ల గుండెలు బిక్కచచ్చిపోయాయి. ఏకంగా 12 సింహాలు రోడ్డుకు అడ్డంగా నిల్చున్నాయి. దీంతో అంబులెన్స్‌ను నిలిపివేశారు.

అయితే అవి ఎంతసేపటికీ కదలక పోవటంతో జిల్లా అంబులెన్స్ ముందుకు కదల్లేదు. చివరకు ఆమెకు రక్త స్రావం అవ్వటం గమనించిన 108 సిబ్బంది అశోక్ అంబులెన్స్‌లోనే మహిళకు ప్రసవం చేయాలని అంబులెన్స్ సిబ్బంది నిర్ణయించాడు. వెంటనే వారు ఫిజిషియన్‌తో ఫోన్లో మాట్లాడి ఆయన సూచనల మేరకు డెలివరీ చేశారు. ఆ సమయంలో అంబులెన్స్‌ను గమనించిన సింహాలు దాని చుట్టూ చక్కర్లు కొట్టడం ప్రారంభించాయంట. ఆపై అంబులెన్స్ డ్రైవర్ రాజు నెమ్మదిగా వాహనాన్ని ముందుకు కదిలించగా, అది చూసి సింహాలు కూడా నెమ్మదిగా రోడ్డు పై నుంచి కదిలాయి. ప్రస్తుతం జఫ్రాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి లో తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manguben Makwana  Gujarat  Lions  Ambulance Delivery  

Other Articles