సెల్ఫీ మోజు ఎప్పుడు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో ఎవరూ చెప్పలేం. క్రేజీ ఫోజులతో ప్రాణాలు పొగొట్టుకున్న ఉదంతాలు ఎన్నో. అంతేందుకు ప్రపంచంలో అత్యధిక సెల్ఫీ మరణాలు మన దేశంలోనే నమోదవుదతున్నాయంటే అతిశయోక్తి కాదు. అలాంటి సెల్ఫీ పిచ్చి మనుషుల్లోనే కాదు.. జంతువులకు పాకితే ఎలా ఉంటుంది?
ఇంగ్లాండ్ లోని బర్మింగ్ హమ్ జూలో జరిగిన ఘటన తెలిస్తే ఎవరైనా అవాక్కవుతారు. రెబెక్కా అనే యువతి బర్మింగ్ హామ్ లోని వైల్డ్ లైఫ్ పార్క్ కి వెళ్లింది. అక్కడ జంతువులను తన సెల్ ఫోన్ లో బంధిస్తూ రెబెక్కా బిజీగా ఉంది. ఇంతలో కాపుచిన్ జాతికి చెందిన కోతి ఒకటి వేగంగా అక్కడికి వచ్చింది. రెబెక్కా చేతిలోని సెల్ ఫోన్ లాక్కుంది. ఈ సమయంలో రెబెక్కా ఆ కోతిని క్లోజప్ లో ఫొటో తీసేందుకు ప్రయత్నించగా కోతి చేయి సరిగ్గా కెమెరా బటన్ పై పడింది. దీంతో ఆ కోతి సెల్ఫీ వచ్చింది.
Romany the yellow-breasted capuchin, from Birmingham Wildlife Conservation Park, getting to grips with his new iPhone ... he loves a selfie. pic.twitter.com/GO9LIbTDx2
— Birmingham Updates (@BhamUpdates) June 27, 2017
దానిని చూసిన సిబ్బంది ఆ కోతి పేరు రొమాని అని చెప్పడంతో ఈ ఫొటోని సోషల్ మీడియాలో రెబెక్కా పోస్టు చేసింది. దీంతో రొమాని ఇప్పుడక్కడ సెలబ్రిటీ అయిపోయింది. కోతి చేష్టలంటూ తీసిపారేస్తుంటాం కానీ, ఇది ఇలాంటివి చూసినప్పుడు ఒక్కోసారి అవే చాలా తెలివైనవని ఒప్పుకుని తీరాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more