కుర్చీలు విసురుకోవటం, బూతుపురాణాలు బహుశా మన అసెంబ్లీలలో దర్శనమిచ్చినట్లు వేరే చోట ఇవ్వటం కష్టమేమో. చట్టసభలకు, చట్టాలకు గౌరవం ఇవ్వలేని వాళ్లు.. అందులో ఉండే తోటి ప్రతినిధులకు ఇస్తారనుకోవటం ముమ్మాటికీ పొరపాటే. కశ్మీర్ అసెంబ్లీలో సాక్షాత్తూ ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. స్పీకర్ సాక్షిగా ప్రతిపక్ష నేతను చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు ఓ మంత్రి.
దేశం మొత్తం జూలై 1 నుంచి జీఎస్టీ అమలు అవుతున్న విషయం తెలిసిందే. అయితే జమ్ముకశ్మీర్ లో మాత్రం అది అమలు కావటం లేదు. దీంతో జీఎస్టీ అమలుపై బుధవారం ఆ రాష్ట్ర అసెంబ్లీలో చర్చ జరిగింది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున్న నిరసన వ్యక్తం అవుతుండటంతో చట్టానికి సవరణ చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
చర్చ జరుగుతున్న క్రమంలో సహనం కోల్పోయిన ఐటీ మంత్రి ఇమ్రాన్ అన్సారీ, ప్రతిపక్ష నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు దేవేందర్ రాణా నుద్దేశించి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనిపై రాణా ప్రతిస్పందనగా తానేమీ పన్నులు ఎగ్గొట్టలేదని మంత్రిని ఎత్తిపొడిచారు. అంతే, ఇమ్రాన్ మరింత కోపోద్రిక్తుడై... ‘‘నిన్ను ఇక్కడే చంపేయగలను. నీ దొంగ వ్యాపారాలన్నీ నాకు తెలుసు. నీకన్నా పెద్ద దొంగ ఎవడూ లేడు. మోబిల్ ఆయిల్ అమ్ముకుంటూ బిజినెస్ ప్రారంభించావు. ఈ సంపదంతా ఎలా పోగేసుకున్నావ్?’’ అంటూ తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగాడు. దీంతో మంత్రి క్షమాపణలు చెప్పాలంటూ సభలో కాసేపు అలజడి రేగింది.
ఇక ఈ వ్యవహారంపై డిప్యూటీ స్పీకర్ నజీర్ అహ్మద్ గురేజీ ఇరు ప్రతినిధులపై మండిపడ్డాడు. ‘‘ప్రజా ధనాన్ని, చట్ట సభ కాలాన్ని వృథా చేస్తున్నారు, జనాలు మిమల్ని గమనిస్తున్నారు. బయట కనిపిస్తే మీ గుడ్డలూదీసి కొడతారు. తిట్టకోవటం ఆపేయండి..’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more