ఇంట్లో ఎలుకలు వున్నాయని ఇంటినే తగులబెట్టిన పరమానందయ్య శిష్యుల తరహాలోనే...నవ్విపోదురుగాక నాకేటి సిగ్గూ అన్నట్లు తయారైంది ప్రభుత్వ అధికారుల పరిస్థితి. ఎవరేమనుకుంటే తమకేంటి.. తామకు కేటాయించిన నిధులకు మాత్రం ఖర్చుపెట్టిన లెక్కలను చూపించాలన్న అధికారుల ముందుజాగ్రత్త.. అటు వారినే కాకుండా వైద్యారోగ్య శాఖ పనితీరును, ప్రభుత్వ సంయమనాన్ని ప్రశ్నించేలా వుంది. దయనీయస్థితిలో ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులకు ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అధికారులు.. కేటాయించిన నిదులను భుక్కడంలో చూపించిన ప్రధాన్యతను మాత్రం చూపడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే అక్కడి అధికారులు చూపిన లెక్కలు అలాగే వున్నాయి.
కర్నూలు జిల్లా ప్రభుత్వాసుపత్రిని అడ్డా చేసుకుని తిష్టవేసిన ఎలుకలను నిర్మూలించేందుకు గాను అధికారులు ఏడాది కాలంలో ఏకంగా రూ.60 లక్షలను ఖర్చుచేశారన్న లెక్కలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏడాదికి అరవై లక్షల రూపాయలను ఎలుక నిర్మూలనకు వినియోగించాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా వుందో అన్న అనుమానాలు కూడా కలగక తప్పదు. అయితే ఇప్పటికైనా ఎలుకల నిర్మూలన పూర్తిగా జరిగిందా..? లేదా..? అన్నది ఇప్పటికీ అధికారులు చెప్పలేక పోతున్నారు. దీంతో పలు అనుమానాలు తెరపైకి వస్తున్నాయి.
ఏడాదికి ఏడాది ప్రభుత్వాసుపత్రిలో ఎలుకల కోసం లక్షల నుంచి కోట్ల వరకు డబ్బును వెచ్చించాల్సి వస్తుందన్న సందేహాలు కూడా తెరపైకి వస్తున్నాయి. అయితే అసుపత్రి నిధుల ఖర్చులలో ఇక నుంచి ఎలుకల నిర్మూలణకు ప్రత్యేక నిధులను కూడా బడ్జెట్ లో కేటాయించాలని కొందరు.. నిజంగా ఈ డబ్బును ఎలుక నిర్మూలనకే ఖర్చుపెట్టారా..? లేక అలవాటు ప్రకారం జేబులో పెట్టుకున్నారా.? అని మరికోందరు సామాజిక మాధ్యమాల్లో జోకులు కూడా పేల్చుతున్నారు.
ఆయితే ఈ ప్రభుత్వాసుపత్రిలో ఎలుకలు అధికంగా ఉన్నాయని, రోగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్న మాట వాస్తవమే అయినా.. అధికారులు వెచ్చించిన డబ్బులు.. చూపుతున్న లెక్కలు మాత్రం అనుమానాలకు తావిస్తుంది. 2016 జూన్ నుంచి 2017 జూన్ వరకు ఎలుకలను పట్టుకునేందుకు ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ కు అధికారులు పనులు అప్పగించారు. అయితే ఏడాది కాలంలో 300 ఎలుకలను కాంట్రాక్టర్ పట్టుకున్నారు. అందుకు అయిన ఖర్చు రూ. 60 లక్షలు. అంటే ఒక్కో ఎలుకకు రూ. 20 వేలు అధికారులు వెచ్చించారన్న లెక్కలు విమర్శలకు తావిస్తుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more