ఓవైపు 45 ఏళ్ల తర్వాత భారత్, చైనాల మధ్య తీవ్ర ఉద్రిక్తతతో దాదాపు యుద్ధ వాతావరణం నెలకొంది. రెండు దేశాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. చైనా మీడియా అయితే భారత్ మీద ఎప్పుడూ లేనంత విషం చిమ్ముతోంది. అయినా మన ప్రధాని మోదీ మాత్రం మౌనంగా ఉంటున్నాడు. ఎందుకు? ఇదే ప్రశ్న వేస్తున్నాడు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఈ మేరకు తన ట్విట్టర్ లో కామెంట్ చేశాడు.
చైనా విషయంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు? అంటూ నిలదీశాడు. ఇంతకు ముందు అమెరికా సందర్భంగా ట్రంప్ తో భేటీ అయి హెచ్-1 బీ వీసాల గురించి చర్చించని మోదీనీ రాహుల్ 'ఓ బలహీన వ్యక్తి' గా పేర్కొన్న విషయం తెలిసిందే. కనీసం సలావుద్దీన్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన సమయంలో అయినా కశ్మీర్ సమస్యపై నోరు విప్పుతాడని భావించినప్పటికీ అదీ జరగలేదని విమర్శించాడు కూడా.
Why is our Prime Minister silent on China?
— Office of RG (@OfficeOfRG) July 7, 2017
జీ20లో సీన్ రివర్స్...
విరుద్ధంగా, ఊహించని విధంగా భారత్ ను చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ జర్మనీలోని హాంబర్గ్ల్ లో జరుగుతున్న జీ20 భేటీలో ప్రశంసల్లో ముంచెత్తాడు. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటం, ఉగ్రవాదాన్ని అణచివేయడానికి భారత్ చేస్తున్న కృషి చాలా గొప్పదని జిన్ పింగ్ ప్రశంసించారు. బ్రిక్స్ దేశాల సమాఖ్యలో కూడా భారత్ పాత్ర చాలా గొప్పదని కొనియాడారు. ఆర్థిక, సామాజిక రంగాల్లో భారత్ సాధిస్తున్న పురోభివృద్ధి అభినందనీయమని అన్నారు. రానున్న రోజుల్లో భారత్ మరింత అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని ఆకాంక్షించారు.
బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) దేశాల అధినేతలు ఓ ఇన్ఫార్మల్ మీటింగ్ లో పాల్గొనగా మోదీ, జిన్ పింగ్ లు షేక్ హ్యాండ్ లు ఇచ్చుకుని, ఆప్యాయంగా పలకరించుకున్నారు. సమావేశంలో ఇద్దరూ పక్కపక్కనే ఆసీనులయ్యారు. అంతకు ముందు మోదీ మాట్లాడుతూ, జిన్ పింగ్ ఛైర్మన్ షిప్ లో బ్రిక్స్ నిర్దేశిత లక్ష్యాలను సాధించే దిశగా కొనసాగుతోందని కితాబిచ్చారు. అయితే వీరిద్దరి మధ్య ప్రత్యేక సమావేశం మాత్రం జరగలేదు.
దీనిపై రాజకీయ విశ్లేషకులు మోదీ చాతుర్యం ప్రకటించాడని పేర్కొంటున్నారు. సమావేశంలో మోదీ ముందుగా మాట్లాడి... చైనా సైతం భారత్ ను పొగడక తప్పనిసరి పరిస్థితిని సృష్టించారు. దీనికి తగ్గట్లే చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తన ప్రసంగంలో భారత్ ను.. మోదీ సర్కారును పొగిడేశారు. ఉగ్రవాదంపై భారత్ పోరును పొగిడిన చైనా అధ్యక్షుడు ఆర్థిక.. సామాజిక రంగాల్లోనూ భారత్ అభివృద్ధిని మెచ్చుకోవటం గమనార్హం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more