Drunken Rajinikanth runs away with Police Bike

Police bike has been hijacked by drunk man

Drunken Man Steal Police Bike, Police Bike Cap Stolen, Karnataka Rajinikanth Funny Video, Drunken Rajinikanth Video, Karnataka Drunk Man Video, Karnataka Drunk Man Bike, Drunk Man Funny Video, Police Bike Cap Theft

Drunk Karnataka man steals cop's bike and cap, gives a tough chase. n a video that is being shared widely on social media, police could be seen chasing the man at least for a kilometer before finally catching him.

ITEMVIDEOS: పోలీసులను ఆటాడుకున్న రజనీకాంత్

Posted: 07/11/2017 09:11 AM IST
Police bike has been hijacked by drunk man

మాములుగా కంటే మనిషి మందులో ఉన్నప్పుడు దాని పవర్ వేరేలా ఉంటుంది. అసాధ్యం కానీ కొన్ని పనులను కూడా మత్తులో సాధ్యం చేసి చూపించగలుగుతారు మందుబాబులు. కర్ణాటకలో ఓ వ్యక్తి ఫుల్ గా తాగి పోలీసులకు చుక్కలు చూపించాడు. అతగాడు చేసిన పనికి చూసిన వారంతా నవ్వుకోవటం తప్పించి వేరే ఏం చేయలేకపోతున్నారు.

హస్సన్ పట్టణంలో గత వారం ఈ ఘటన చోటుచేసుకుంది. బాగా తాగేసిన ఓ వ్యక్తికి పోలీస బైక్ కనిపించింది. వెంటనే దాన్ని కొట్టేసి రోడ్డుపై హాయిగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లిపోసాగాడు. షాక్‌కు గురైన పోలీసులు మరో బైక్ పై అత‌డిని వెంబ‌డిస్తుండగా, వెనకాల కూర్చున్న కానిస్టేబుల్ టోపీని కూడా లాక్కున్నాడు. టోపీని తాను పెట్టుకుని నవ్వుకుంటూ ముందుకు వెళ్లిపోయాడు. చివరకు ఛేజ్ చేసిన పోలీసులు ఎట్టకేలకు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

 

సుమారు ఒక కిలోమీటర్‌ వరకు వెంబడించిన‌ట్లు తెలుస్తోంది. తాగుబోతు బైక్‌పై వెళుతుండ‌గా చూసిన ఇతర వాహనదారులు అతన్ని వీడియో తీశారు. పైగా 'సూపర్‌స్టార్‌ రజనీకాంత్' అంటూ మ‌రింత రెచ్చ‌గొట్టడంతో అతగాడు మరింత చెలరేగిపోవటం చూడొచ్చు. నవ్వులు పూయిస్తున్న ఈ వీడియోను మీరూ ఓ లుక్కేస్కోండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karnataka  Drunk Man  Police Bike  Funny Video  

Other Articles