ప్రేమించిన యువతిపై అమెకు తెలియకుండానే అత్యాచారానికి పాల్పడి.. అమెను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని భావించిన ప్రేమోన్మాది.. అందుకు ఆ యువతి నిరాకరించడంతో అమెకు కాబోయే భర్తకు అమెతో సన్నిహితంగావ వున్న వీడియోలను వాట్సాప్ ద్వారా పంపించాడు. దీంతో బిత్తరపోయిన కాబోయే పెళ్లికొడుకు వాటిని చూసి యువతి తల్లిదండ్రులను నిలదీశాడు. దీంతో ఆ యువతి పెళ్లి నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది.
తమిళనాడులో ఈ దారుణ ఘటన చోటుచేసుకోగా. యువతి అమె తల్లిదండ్రులతో కలసి పోలీసులకు పిర్యాదు చేయడంతో క్రిడాకారుడైన ప్రేమోన్మాదిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. నిందితుడు అమెపై అత్యాచారానికి పాల్పడ్డానని అంగీకరించాడు. తాము క్లోజ్ గా వున్న సమయంలోనే ఓ రోజు అమెను తన స్నేహితుల గదికి తీసుకువెళ్లి శీతలపానీయంలో మత్తమందు కలపి ఇచ్చి యువతిపై అత్యాచారానికి పాల్పడినట్టు నిందితుడు వాంగ్మూలంలో పేర్కోన్నాడు.
ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే.. అమెకు సంబంధించిన అసభ్య చిత్రాలను అన్ లైన్ లో పెడతానని బెదిరించడంతో యువతి వెళ్లిపోయిందని, అప్పటి నుంచి అమె తనతో మాట్లాడటం లేదని నిందితుడు తెలిపాడు. కాగా నిందితుడు గతంలోనూ అనేక మంది యువతులతో ఇదే తరహాలో అత్యాచారాలకు పాల్పడ్డాడని అరోపణలు వస్తున్నాయి. దీపక్ సెల్ పోన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈ విషయాన్ని తెలుసుకున్నారని సమాచారం. కాగా రంగంలోకి దిగిన పోలీసులు అ కోణంలో విచారణ జరుపుతున్నారు.
ఎంబీఏ చదువుతున్న చెన్నై ట్రిప్లికేన్ కు చెందిన ఓ యువతి.. స్థానికంగా ఆమె తండ్రి నిర్వహిస్తున్న హర్డిల్స్ క్రీడా కేంద్రానికి వస్తుండేది. అక్కడే టీపీ సత్రం జ్యోతియమ్మాల్ నగర్ కు చెందిన దీపక్ అలియాస్ డేనీ శిక్షణ పొందుతున్నాడు. యువతి తరచుగా వస్తుండడంతో దీపక్ ఆమెతో స్నేహంగా మెలిగాడు. ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అయితే దీపక్ యువతిపై అత్యాచారానికి తెగబడి.. బెదిరింపులకు పాల్పడటంతో అమె నిందితుడితో దూరంగా వుంటుంది.
వీరిమధ్య ప్రేమాయణంపై అనుమానాం కలిగిన యువతి తల్లిదండ్రులు అమెకు పెళ్లి చేయాలని నిశ్చయించారు. విషయం తెలుసుకున్న దీపక్.. తనను పెళ్లి చేసుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించాడు. అయినా తల్లిదండ్రులు చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని యువతి తెగేసి చెప్పింది. దీంతో అమెను దక్కించుకోవాలన్న ప్రేమోన్మాది అమెకు కాబోయే వరుడి సెల్ ఫోన్ నెంబరును తెలుసుకుని అతనికి వారిద్దరి సన్నిహితంగా వున్న అసభ్య వీడియోలను పంపిచాడు. దీంతో అవ్వాక్కయిన కాబోయే పెళ్లికొడుకు విషయాన్ని యువతి తల్లిదండ్రులకు చెప్పడం.. వారు పిర్యాదు చేయడంతో దీపక్ కటకటాలపాలయ్యాడు. అయిేత యువతి పెళ్లిపై మాత్రం సందిగ్ధంలో పడింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more