Lalu Prasad Yadav's son-in-law appears before ED నన్ను, నా పార్టీని లేకుండా చేయాలని కేంద్రం ప్రయత్నం

Bjp wants to finish me and rjd alleges lalu prasad yadav

Misa Bharti, Lalu Prasad Yadav, son in law, Shailesh Kumar, money laundering case, Enforcement directorate, Bihar, Nitish Kumar, Tejashwi Yadav, Lalu Yadav, PM modi, Amit shah, politics

RJD chief Lalu Prasad expressed apprehension that the BJP may get him arrested ahead of the August 27 Opposition rally in Patna. “The BJP wants to finish Lalu as I want to finish the BJP,” he said.

నన్ను, నా పార్టీని లేకుండా చేయాలని కేంద్రం ప్రయత్నం

Posted: 07/12/2017 11:42 AM IST
Bjp wants to finish me and rjd alleges lalu prasad yadav

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అల్టిమేటంకు మిత్రపక్ష అర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌ కౌంటర్ అటాక్‌ ఇచ్చారు. తమతో మిత్రపక్షంగా వుంటూ విపక్షానికి చెందిన బీజేపితో సన్నిహితంగా మెలగడంపై ఆయన నితీష్ సక్కార్ పై అసహనం వ్యక్తం చేశారు. వారికి అనుకూలంగా నితీష్ కుమార్ చర్యలు తీసుకోవడం అర్థరహితమన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తన తనయుడు తేజస్వీ యాదవ్‌ నాలుగు రోజుల్లోగా డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయలన్న అల్టిమేటంను లాలూ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు.  

ల్యాండ్‌ ఫర్‌ హోటల్‌ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తన కుమారుడు బిహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ను నాలుగు రోజుల్లో రాజీనామా చేయాలని సీఎం నితీశ్‌కుమార్‌ అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబసభ్యులు, అనుచరులపై సీబీఐ దాడులు నిర్వహించిన నేపథ్యంలో లాలూ తొలిసారి 'ఇండియా టుడే'కు ఇంటర్వ్యూ ఇచ్చారు. నితీశ్‌కుమార్‌ క్యాబినెట్‌ నుంచి డిప్యూటీ సీఎంగా తేజస్వి తప్పుకునే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు.

తనను, తన పార్టీని రాజకీయంగా ఎదుర్కునే అవకాశం లేక కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం అడ్డదారుల్లో అక్రమ కేసులు బనాయించి ప్రతీకారచర్యలకు పాల్పడుతుందని అన్నారు. ఆర్జేడీని ఫినిష్‌ చేసేందుకే ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా కుట్ర పన్నారని, అందులో భాగంగానే కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు తమపై దాడులు చేస్తున్నాయని లాలూ ఆరోపించారు. ప్రధానిగా పోటీ చేసే సమయంలో నితీష్ ప్రభుత్వంపై కూడా కుట్రపూరితంగా పలు అరోపణలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఇక తేజస్వీ యాదవ్ ను పదవి నుంచి తప్పించేందుకు చేస్తున్న యత్నాలన్ని తప్పని ఆయన కోట్టిపారేశారు.  'హోటల్‌ ఒప్పందం కుదిరినప్పుడు తేజస్వి మైనర్ గా వున్నాడని, అదీకాక ఆయన క్రికెట్‌ ప్లేయర్ గా కొనసాగుతున్నాడని అన్నారు. అతనిపై ఆరోపణలు ఆధారరహితం' అని లాలూ కొట్టిపారేశారు. ఇదిలా వుండగా నిన్న లాలూ కూతురు మిస్బా భారతి ఎన్ఫోర్సమెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరుకాగా, ఇవాళ లాలూ ప్రపాద్ యాదవ్ అల్లుడు శైలేష్ కుమార్ ను హాజరు కావాల్సిందిగా ఈడీ నోటీసులను అందించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bihar  Nitish Kumar  Tejashwi Yadav  Lalu Yadav  PM modi  Amit shah  politics  

Other Articles