Flipkart Mega Sale to Counter Amazon Prime Day Sale అమెజాన్ కు పోటీగా ఫ్లిప్ కార్ట్ బ్రహ్మాండమైన ఆపర్లు..

Following amazon prime day flipkart launches 80 online sale

Redmi Note 4, PhonePe, Mi, Flipkart prime sales, Ecommerce, Divastri, amazon prime day, sales galore, Flipkart, Amazon India, offers, discounts, 80percent, business

After the pre-GST clearance sale, Amazon announced Prime Day Sale for the first time in India and now rival Flipkart has launched its own sale starting today. Flipkart has come out with another festival promising great deals at up to 80% discounts.

అమెజాన్ కు పోటీగా ఫ్లిప్ కార్ట్ బ్రహ్మాండమైన ఆపర్లు..

Posted: 07/12/2017 05:05 PM IST
Following amazon prime day flipkart launches 80 online sale

భారతీయ విఫణీలో ఇప్పుడు రసవత్తరమైన పోరు జరుగుతుంది. దానికి మరో పేరే కాంఫిటీషన్. టెలీ కమ్యూనికేషన్ రంగం నుంచి ప్రారంభమైన ఈ పోరు ఎయిర్ ఫేయిర్ వార్ వరకు సాగుతుంది. తాజాగా ఈ కాంఫిటీషన్ ఈ కామర్స్ సంస్థల మధ్య కూడా నెలకొంది. దీంతో వినియోగదారులకు ఆఫర్ల వర్షం కురుస్తోంది. ఇప్పటికే తన ఫ్రైమ్ కస్టమర్ల కోసం మాత్రమేనంటూ ఆఫర్లను కురిపించిన అమెజాన్ కు పోటీగా మరో ఈ రీటైలర్‌ దిగ్గజం​ఫ్లిప్‌ కార్ట్ కూడా డిస్కౌంట్లు, ఆఫర్లను ప్రకటించింది. అదీ ఏకంగా ఎంపిక చేసిన వస్తువులపై 80శాతం వరకు డిస్కౌంట్లను అందిస్తోంది.   

అమెజాన్ తరహాలోనే ఫ్లిప్ కార్ట్ కూడా దేశంలోని తన ప్రైమ్ సభ్యులను ఆకట్టుకునేందుకు స్పెషల్‌  అమ్మకాలను ప్రారంభించింది. మరీ ప్రత్యకంగా స్మార్ట్ ఫోన్ల విడుదలతో పాటు వస్త్రాలు, ముఖ్యంగా కిచెన్ సామాగ్రి‌, ఫూట్ వేర్‌, షియామి, సామ్ సంగ్‌ , సోనీ, ఇతర ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులతో పాటు ఆదిదాస్, ప్యూమా, లివైస్‌, ఫాసిల్, హైడ్ సైన్ తదితర బ్రాండ్లపై డిస్కౌంట్లు అందిస్తోంది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ఆఫర్లను వెల్లడించింది. ముఖ్యంగా ఫియామి నోట్‌ 4  రూ 9,999కు, గోల్డ్, బ్లాక్, డార్క్ గ్రే రంగుల్లో అందుబాటులో ఉంటుంది. గెలాక్సీ ఫోన్లపై కూడా అఫర్లను ప్రకటించింది.

ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లపై 35 శాతం, మహిళల దుస్తులు, పాదరక్షలు,  లోదుస్తులపై 70 శాతం డిస్కౌంట్ ఆఫర్‌ చేస్తోంది. టీవీల  కొనుగోళ్లపై జీరో ఈఎంఐ  ఆప్లన్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తోంది.మైక్రో మ్యాక్స్ 50 అంగుళాల ఫుల్‌ హెచ్డీ ఎల్ఈడీటీవీలపై దాదాపు 50 శాతం తగ్గింపు, ఫాజిల్ వాచీలపై 30 శాతం రాయితీలను ప్రకటించింది. ఇక హెచ్డీఎఫ్సీ బ్యాంకు క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో చెల్లింపులు చేస్తే అదనంగా 10 శాతం డిస్కౌంట్ కూడా అందించనుంది. అలాగే ఫోన్ పే యాప్ ద్వారా చెల్లిస్తే 15 శాతం క్యాష్ బ్యాక్ ను పొందే అవకాశాం వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sales galore  Flipkart  Amazon India  offers  discounts  80percent  business  

Other Articles