suicide attempt of a family at CM camp office సీఎం క్యాంపు కార్యాలయం ఎదుట విషాదం..

A family from nalgonda attempts suicide at cm camp office

nagaraju, navya, srinivas, nagaraju family suicide attempt, cm camp office security, Family members, Nalgonda, suicide attempt, CM KCR, CM camp office, CM security personal, poison, gandhi hospital, hyderabad, Telangana

A Family from Nalgonda district attempts suicide after cm security personal rejects them from meeting kcr. The victims are said to be serious, after they were rushed to gandhi hospital

సీఎం క్యాంపు కార్యాలయం ఎదుట విషాదం..

Posted: 07/13/2017 06:42 PM IST
A family from nalgonda attempts suicide at cm camp office

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంప్ కార్యాలయం ఎదుట విషాదం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావును కలిసేందుకు వచ్చిన ఓ కుటుంటంలోని మగ్గురు తీవ్రంగా ప్రయత్నించి విఫలం కావడంతో తమకు మరణమే శరణ్యమని అత్మహత్యకు పాల్పడ్డారు. కోటి అశలతో తెలంగాణను సాధించుకున్న ప్రజలకు తెలంగాణ ఉద్యమ ఊపిరిగా నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ పై అచెంచలమైన విశ్వాసంతో ఆయనను, ఆయన పార్టీని గత ఎన్నికలలో అశీర్వదించారు. అయితే పదవీ బాద్యతలను చేపట్టిన కొత్తలో ముఖ్యమంత్రి తనకోసం వచ్చిన ప్రజలను కలిసి వారి వినతులను స్వీకరించి సమస్యలను పరిస్కరించేవారు.

అయితే గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో వున్న ముఖ్యమంత్రి ప్రజలను కలిసే ప్రక్రియను నిలిపివేశారు. ఈ విషయం తెలియని కొందరు సుదూర ప్రాంతాల నుంచి ముఖ్యమంత్రిని కలిసేందుకు వస్తున్నారు. తమ కష్టనష్టాలను ఏకంగా ముఖ్యమంత్రి వద్దే ఏకరువు పెడదామని అనేకమంది క్యాంపు కార్యాలయానికి చేరకుంటున్నారు. అయితే భద్రతా సిబ్బంది అనుమతించకపోవడంతో అనేకులు తమ స్వస్థలాలకు తిరుగుపయనం అవుతుండగా, తీవ్రమైన కష్టాలలో వున్నవారు మాత్రం ఎలాగైనా తము ముఖ్యమంత్రిని కలసి తమ గోడు వెల్లబోసుకోవాలని ప్రయతిస్తున్నారు. ఈ క్రమంలో పలువురు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.

srinivas suicide attempt

తాజాగా నల్గొండ జిల్లాకు చెందిన నాగరాజు కటుంబం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. అయితే, కేసీఆర్ ను కలిసేందుకు సీఎం భద్రతా సిబ్బంది అనుమతించలేదు. దీంతో నాగరాజు (40), కూతురు నవ్య (13), మేనల్లుడు శ్రీనివాస్ (18) లు పురుగుల మందు సేవించి అఘాయిత్యానికి పాల్పడ్డారు. హుటాహుటిన స్పందించిన పోలీసులు బాధితులను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles