గత నెల 7వ తేదీన ఇంటి నుంచి అదృశ్యమై, రెండు రోజుల క్రితం ముంబైలో ప్రత్యక్షమై, తల్లిదండ్రులను చూసేందుకు, వారితో వెళ్లేందుకు ససేమిరా అన్న పదో తరగతి విద్యార్థిని పూర్ణిమా సాయి వ్యవహారంలో మరో ఇంట్రెస్టింగ్ విషయం బయటపడింది. ఈ కేసు ఇంత త్వరగతిన తేలటానికి, సీబీఐ మాజీ జేడీ, మహారాష్ట్ర అడిషనల్ డీజీపీగా ఉన్న మన తెలుగు తేజం వీవీ లక్ష్మీ నారాయణ అని తేలింది. ఆయన జోక్యం మూలంగానే పూర్ణిమ వ్యవహారంను ఆ రాష్ట్ర పోలీసులు సీరియస్ గా తీసుకుని ఛేదించగలిగారు.
సాధారణంగా సినిమా ఆఫర్ల కోసం పిల్లలు ఇంటి నుంచి పారిపోయి ముంబైకి రావటం జరుగుతుంటుంది. తాను బాధ్యతలు స్వీకరించాక ఇలాంటి కేసుల ఎక్కువగా తన పరిశీలనలోకి రావటంతో ప్రత్యేక దృష్టిసారించి ఓ టీంను కూడా నెలకొల్పాను. దానికి కొన్ని ఎన్జీవోలు కూడా సాయం చేస్తున్నాయి. ఇక పూర్ణిమ కేసుకు సంబంధించి అన్ని మాధ్యమాలలో చూస్తూ వస్తున్న ఆయన మొదటి నుంచి ఫాలో అప్ అవుతూ వస్తున్నాడంట. ఈ క్రమంలో ఇలాంటి కేసులను గమనించిన ఆయన గుళ్లో, రైల్వే స్టేషన్లు, బస్టాండ్ లలో వెతకాలని కిందిస్థాయి అధికారులకు సూచించాడంట.
మరోపక్క షిర్డీ నుంచి దాదార్ రైల్వే స్టేషన్ లో దిగింది. అక్కడ బాలికను గమనించిన రైల్వే పోలీసులు ఓ ఎన్జీవో సాయంతో బాలసదన్ లో చేర్పించారు. ఈ విషయం సదరు ఎన్జీవో సంస్థ స్థానిక సీఐ బాలకృష్ణ రెడ్డికి తెలుపగా, లోకల్ డీసీపీ అంబిక లక్ష్మీనారాయణకు చేరవేసిందంట. ఆపై ఆయన సూచన మేరకు బోయివాడ పోలీస్ స్టేషన్ ఎస్సై మహాజన్ కేసును బాగా సీరియస్ గా తీసుకుని చేధించాడని తెలిపాడు. ఫోటోను క్రాస్ చెక్ చేసుకున్నాక దొరికింది పూర్ణిమే అని తెలిశాక తల్లిదండ్రులకు సమాచారం చేరవేశామని లక్ష్మీ నారాయణ వివరించాడు.
అయితే నిజాం పేట్ నుంచి అదృశ్యం అయ్యి ముంబైలో ఎలా తేలిందన్న విషయం పై లోతైన దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించాడు. ఇలాంటి విషయాలను సీరియస్ గా తీసుకుని తల్లిదండ్రులు ఏం చేయాలన్న దానిపై దృష్టిసారించాలని ఆయన సూచించాడు. పిల్లలు ఇంటి నుంచి పారిపోతే దానిని కిడ్నాప్ కిందే పరిగణించి కేసు నమోదు చేస్తేనే కేసు తీవ్రత మూలంగా త్వరగతిన పరిష్కారం అవుతాయని ఆయన అంటున్నాడు.
అనిక శ్రీ ఎవరు?
పూర్ణిమ సాయి తన పేరును అనికా శ్రీగా ముంబైలో చెప్పుకోవడం వెనుక ఆసక్తికర కోణం ఉన్నట్టు తెలుస్తోంది. ఎలాగైనా సినిమాల్లో నటించి పేరు తెచ్చుకోవాలన్న బలమైన కోరికతో ముంబై చేరుకున్న పూర్ణిమ, తాను ఇంట్లో ఉన్న వేళ, ఓ హిందీ సీరియల్ ను అమితంగా చూసేది. ఆ సీరియల్ లో హీరోయిన్ పేరు 'అనిక' కావడంతోనే ముంబైలోని ఆశ్రమంలో చేరే ముందు తన అసలు పేరుకు బదులు అనికా శ్రీ అని చెప్పినట్టు పోలీసులు అంచనాకు వచ్చారు. పూర్ణిమను హైదరాబాద్ కు తెచ్చేందుకు ముంబై వెళ్లిన తల్లిదండ్రులు రిక్తహస్తాలతో వెనుదిరిగి రాగా, నేటి రాత్రికి ఇక్కడకు తెచ్చి, రేపు ఉదయం ఆమెను కోర్టులో హాజరు పరుస్తామని బాచుపల్లి పోలీసు అధికారులు వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more