Poes Garden chef cooking for Sasikala in jail జైలులో శశికళ రాజభోగాలు చూడతరమా..?

Special favour poes garden chef cooking for sasikala in jail

vip treatment to sasikala, sasikala parappana agrahara jail, D Roopa Moudgil, VK Sasikala, Bengaluru Jail, AIADMK, Parappana Agrahara Central Prison, satyanarayana, siddaramaiah, karnataka

Photos of jailed AIADMK leader V.K. Sasikala given special privileges in Parappana Agrahara Central Jail were released to the media

ITEMVIDEOS: జైలులో శశికళ రాజభోగాలు చూడతరమా..?

Posted: 07/18/2017 06:57 PM IST
Special favour poes garden chef cooking for sasikala in jail

తమిళనాడు ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళకు బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో రాజభోగాలు అందుతున్నాయన్న అరోపణలతో బదిలీ వేటుకు గురైన మహిళా ఐపీఎస్ అధికారిని డి. రూపా మౌద్గిల్ అరోపణల్లో నిజాలు వున్నాయని స్పష్టం అవుతుంది. తాజాగా వెలుగుచూసిన పలు వీడియోలు, ఫోటోలు అమె రాజభోగాన్ని దర్ఫణం పడుతున్నాయి. అమెకు జైలు అధికారులు ఏకంగా నాలుగు సెల్ లను కేటాయించారు. అంతేకాదు అమెకు పోయిస్ గార్డెన్ లో వంటచేసే వ్యక్తినే జైలుకు రప్పించుకుని మరీ ఆ వంటనే శశికళ తింటున్నారన్న వార్తలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి,.

రూపా అరోపణలను జైళ్ల శాఖ ఏడీజీపి సత్యనారాయణ నిద్వందంగా తోసిపుచ్చానా.. ఒక సెల్ కేటాయించాల్సిన శశికళకు ఏకంగా నాలుగు గదులను కేటాయించడంలో అంతర్యమేమిటని నెట్ జనులు ప్రశ్నిస్తున్నారు. ఒక సెల్ గదిలో వంటగది, రెండో గదిని అమె డ్రెసింగ్ రూమ్ గా మార్చుకున్నారు. అందుకోసం కొన్ని ప్రత్యేక పరికరాలు ఉంచుకోవడానికి కప్ బోర్డులు కూడా ఉన్నాయి. ఇక మరో గదిలో విజిటర్స్ ను కలవడానికి కుర్చీలు, బెంచీలు ఉన్నాయి. మరో సెల్ గదిని శశికళ నిద్రించడానికి వినియోగిస్తున్నారని తెలుస్తుంది. అమె నిదురించే గదిలో ఫ్యాన్‌, మస్కిటో కాయిల్స్‌ కూడా కేటాయించినట్లు ఉన్న ఫోటోలు సోసల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

శశికళకు కేటాయించిన బ్యారక్ లోనికి అమె అనుమతి లేకుండా ఎవరినీ అనుమతించేవారు కాదని సమాచారం. ఇక ఒక సెల్ గదికి తెరకూడా వుందని దీంతో లోపల అమె ఎం చేస్తున్నారో.. ఎవరితో మాట్లాడుతున్నారో అన్న విషయాలు కూడా బయటకు అందే మార్గం లేదని తెలుస్తుంది. శశికళకు వెసలు బాటు కోసం ఇప్పటికే ఈ జైలు నుంచి దాదాపుగా 40 మంది ఖైదీలను వేర్వేరు జైళ్లకు తరలించారని కూడా అరోపణలు వినబడుతున్నాయి. అమెకు సంబంధించిన సమాచారాన్ని లీక్ కాకుండా వుండేందుకే జైలు అధికారులు ఈ విధమైన చర్యలు చేపట్టారని అరోపణలు గుప్పుమంటున్నాయి. మరి ఇందులో నిజానిజాలు ఏమిటో సంబంధిత విచారణ కమిటీ దర్యాప్తులోనే వెలుగుచూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles