దేశంలో డీమానిటైజేషన్ చేపట్టిన తరువాత కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ తీసుకోచ్చిన దేశంలోనే అత్యంత పెద్ద విలువైన రూ. 2000 కరెన్సీ నోటును దేశీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. అయితే గత కొన్ని రోజులుగా ఈ నోటు కనిపించడం లేదు. ఏ ఏటీయం కేంద్రంలో డబ్బును విత్ డ్రా చేసినా.. బ్యాంకుల్లో వాటిని కోసం ఎదురు చూసినా అవి కనిపించడం లేదు. అయితే వాటి స్థానంలో కేవలం కొత్తగా ప్రవేశపెట్టిన రూ.5 నోట్లు..మాత్రమే దర్శనమిస్తున్నాయి.
పాత పెద్ద నోట్ల రద్దు ప్రక్రియలో భాగంగా తొలుత ఈ నోట్లనే ఎక్కువగా మార్కెట్లోకి తీసుకురావడంతో ప్రజలు చిల్లర దొరకక నానా కష్టాలు పడ్డారు. అయితే తాజా పరిస్థితి మాత్రం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఆ నోట్లు కోసం ఎంత వెతికినా కనిపించడం లేదు. దీనికి కారణం ప్రస్తుతం ఆ కరెన్సీ నోట్ల సరఫరాను రిజర్వు బ్యాంకు తగ్గించినట్టు తెలుస్తోంది. కొన్ని వారాల నుంచి 2000 రూపాయి నోట్ల సరఫరా పడిపోయినట్టు ఓ ఆంగ్ల పత్రిక రిపోర్టులో తేలింది. 2000 రూపాయి నోట్ల సరఫరాను తగ్గించి, ఆర్బీఐ ఎక్కువగా కొత్త రూ.500 నోట్ల సరఫరాపై దృష్టిసారించినట్టు ఈ రిపోర్టు నివేదించింది.
ప్రస్తుతం ఎక్కువగా రిజర్వు బ్యాంకు నుంచి అధికంగా ఎక్కువ విలువ కలిగిన నోట్లలో 500 రూపాయి నోట్లే వస్తున్నాయి'' అని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నీరజ్ వ్యాస్ చెప్పారు. కేవలం 2000 రూపాయి నోట్లను రీసర్క్యూలేషన్ కిందనే తిరిగి మళ్లీ తమ దగ్గరకు వస్తున్నాయని, కొత్తగా ఆర్బీఐ నుంచి ఏమీ రావడం లేదన్నారు. ప్రీ-డీమానిటైజేషన్ సమయంలో ఉన్న నగదు కంటే తక్కువగానే ప్రస్తుతం మార్కెట్లో నగదు ఉందని కూడ అర్థిక నిఫుణులు అంచనా వేస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో అసలు అందుబాటులోకి తీసుకువచ్చిన కొత్త రూ.2000 నోట్లు ఎక్కడున్నాయి. ఏవరి ఖాజానాలో బంధీగా మారాయన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more