Key Leaders fight for CM's Next Chair

Aiadmk key leaders fight in public

AIADMK, AIADMK Leaders Fight, Udumalai Radhakrishnan Pollachi Jayaraman Fight, Palaniswami Next Seat Fight, AIAMDK political Slugfest, Palaniswami, Key Leaders Fight

The AIAMDK, which has been going through a political slugfest, witnessed an actual one on Sunday when Housing and Urban Development Minister Udumalai Radhakrishnan and Deputy Speaker Pollachi Jayaraman fought publicly to sit next to Chief Minister E Palaniswami on the dais at an event in Tiruppur city. An embarrassed Palaniswami had to personally intervene and end the fight as hundreds watched at the function to mark the birth centenary of party founder MG Ramachandran.

సీఎం ముందే కుర్చీ కోసం తన్నులాట!

Posted: 07/24/2017 08:56 AM IST
Aiadmk key leaders fight in public

రాజకీయాలు అక్కడ ఎంత దారుణంగా తయారు అయ్యాయంటే.. సొంత పార్టీలోనే కుంపటి రగిలి అన్నదమ్ముల మెదిలిన నేతలు తన్నుకునేంత వరకు... ఆదివారం వందలాది మంది కార్యకర్తల సమక్షంలోనే అన్నాడీఎంకే కీలక నేతలు ఇద్దరు కుమ్ముకోవటంతో పార్టీ పరువు కాస్త కావేరిలో కలిసిపోయినట్లయ్యింది.

తిరుప్పూరు నగరంలో ఎంజీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించగా, ఈ సందర్భంగా ఓ బహిరంగ సభను ఏర్పాటు చేశాడు. దీనికి తమిళనాడు సీఎం పళనిస్వామి హాజరయ్యాడు. ఆయన స్టేజీపై కూర్చోగానే పక్కనే తాను కూర్చుంటానంటే తానంటూ డిప్యూటీ స్పీకర్ పొల్లాచి జయరామన్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఉడుమలై రాధాకృష్ణన్ గొడవపడ్డారు. ఒకానోక దశలో ఇద్దరూ తోసేసుకునేంత వరకు పరిస్థితి వెళ్లింది.

మరోవైపు వారి మద్దతుదారులు ఒకరిపై ఒకరు పరస్పరం వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు. దీంతో, స్వయంగా పళనిస్వామి వచ్చి వారికి సర్దిచెప్పాల్సి వచ్చింది. జయరామన్ ను వేరే కుర్చీలో కూర్చోవాల్సిందిగా పళనిస్వామి కోరాడు. అయితే కార్యకర్తలు మాత్రం నినాదాలు ఆపకపోగా చివరకు స్పీకర్ ధన్ పాల్ వారించటంతో పరిస్థితి సర్దుమణిగింది. అమ్మ మరణం తర్వాత పరిస్థితి ఎంత దారుణంగా తయారయ్యిందో తెలియజేసేందుకు ఇది జస్ట్ ఓ శాంపిల్ మాత్రమే.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AIADMK  CM Palaniswamy  Key Leaders Fight  

Other Articles