తెలుగు సినీ పరిశ్రమకు చెందని అనేక మందిని కుదిపేస్తున్న డ్రగ్స్ కేసు.. వాటితో లింకులున్న వారందిరిలో వణుకుపుట్టిస్తుంది. కాగా ఈ కేసులో నోటీసులు అందుకున్న నటి చార్మి ఏకంగా హైకోర్టును ఆశ్రయించింది. డ్రగ్స్ కేసులో రక్త నమూనాల సేకరణ సరికాదని హైకోర్టులో అమె రిట్ పిటీషన్ దాఖలు చేసింది. విచారణ తీరు సరిగా లేదని చార్మి ఆరోపించింది. అర్టికల్ 20 సబ్ క్లాప్ ప్రకారం రక్త నమూనాలను బలవంతంగా సేకరిస్తున్నారని చార్మి పిటిషన్ లో పేర్కొంది.
అంతేకాకుండా విచారణకు తాము న్యాయవాదిని తీసుకెళ్లే వెసలుబాటు కల్పించాలని కోరింది. కాగా చార్మీ పిటీషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం చంద్రవదన్, అకున్ సబర్వాల్, ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ , సూపరింటెండెంట్లకు నోటీసులు జారీ చేసిన రాష్ట్రోన్నత న్యాయస్థానం మంగళవారం ఈ పిటీషన్ పై విచారించనుంది. ఈ కేసుకు సంబంధించి సినీనటి చార్మిని ఈ నెల 26వ తేదీన ఎక్సైజ్ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారించనుంది.
ఈ మేరకు ఆమెకు ఇప్పటికే అధికారుల నోటీసులు అందించడంతో పాటు మీడియాకు ద్వారా కూడా ఎవరెవరిని ఎప్పుడెప్పుకు విచారిస్తున్నామన్న సమాచారాన్ని తెలిపారు. మరోవైపు చార్మికి డ్రగ్స్ మీద దృష్టిపెట్టేంత తీరిక, సమయం లేదని ఆమె తండ్రి దీప్ సింగ్ అన్నారు. అనవసరంగా ఆమెను ఈ కేసులోకి లాగారని మండిపడ్డారు. కాగా దర్శకుడు పూరీ జగన్నాథ్ కు కూడా ఈ కేసుతో ఎలాంటి సంబంధం ఉండదని, ఆయన ముత్యం లాంటి వాడని దీప్ సింగ్ కితాబిచ్చారు.
బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొంటున్న ఐటమ్ గర్ల్ ముమైత్ ఖాన్ విచారణపై సందిగ్ధం వీడింది. ఆమెను ఈ నెల 27న విచారించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు అమె బిగ్ బాస్ కార్యక్రమ నిర్వాహకుల నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్న అధికారులు.. ఆమెను 27న సిట్ ఎదుట హాజరు కావాలని చెప్పారు. అయితే ఎవరు ఎలా స్పందిస్తున్నా.. తమ విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసు అధికారులు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more