ముక్కు మొహం తెలీని వాళ్లతో సవాసాలు చేస్తున్న క్రమంలో దారుణాలు జరుగుతున్నా వాటిని గుణపాఠాలుగా తీసుకోలేకపోతుంది నేటి యువత. కళ్ల ముందు జరిగే మోసాలు చూస్తూ అప్రమత్తంగా ఉండలేకపోతున్నారు. ఇక్కడ అలాంటి ఘటనే ఒకటి జరిగింది. అందమైన‘ఫేస్బుక్ ప్రేయసి’అంతే అందమైన స్టోరీని బాయ్‌ఫ్రెండ్‌కు వినిపించింది. కరిగిపోయి చివరకు బకరా అయిపోయాడు ఆ యువకుడు. విజయవాడ పరిధిలో జరిగిన ఘటన వివరాల్లోకి వెళ్లితే...
రిటైర్డ్ రైల్వే ఉద్యోగి కుమారుడు అయిన నందు (17) ఫేస్ బుక్ లో ఓ అమ్మాయితో పరిచయం ఏర్పరుచుకున్నాడు. మెల్లిగా ఆ పరిచయం ఛాటింగ్, ఆపై టేస్టులు కలవటంతో మెల్లిగా ప్రేమ వైపు మళ్లింది. కొన్నాళ్ల తర్వాత యువకుడు ప్రపోజ్ చేయగా, యువతి ఒప్పుకుంది. ఫేస్ బుక్ లో ఎప్పటికప్పుడు తన ఫోటోలు అప్ లోడ్ చేస్తూ యువతి అతని రెచ్చగొట్టసాగింది. కొన్ని రోజుల తర్వాత తనకు అత్యవసరంగా డబ్బులు అవసరమని పెద్ద కథే చెప్పి నమ్మించింది. ఏం చేయాలో పాలుపోని కుర్రాడు తన తండ్రి బ్యాంకు ఖాతా నుంచి ఏకంగా రూ.14 లక్షలు ఆమెకు ట్రాన్స్ ఫర్ చేశాడు.
ఇటీవలె రిటైర్ట్ అయిన తండ్రి ఖాతా నుంచి రూ.20వేలు, రూ.40 వేలు చొప్పున 34 ట్రాన్సాక్షన్స్ ద్వారా ఈ మొత్తం సొమ్మును ఆమెకు చేరవేశాడు. తర్వాత యువతి నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో తాను మోసపోయిన విషయం గుర్తించి పేరెంట్స్ కు చెప్పి ఆపై పోలీసులకు ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, యువకుడు ట్రాన్స్ఫర్ చేసిన అకౌంట్ కోల్‌కతా కు చెందిందిగా కనిపెట్టి, ఐపీ అడ్రస్ తో ఆ ప్రేయసిని పట్టుకునే యత్నంలో ఉన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more