రేప్ లకు చెక్ పెట్టేందుకు అమ్మాయి యువతి స్మార్ట్ ఆలోచన | Smart Sticker Safe for Woman from Sexual Assault

Smart sticker helps prevent sexual assault in real time

Manisha Mohan, Smart Sticker, Manisha Mohan Sexual Assault, India Girl Rape Escape, Manisha Mohan Smart Sticker, Technology Prevent Rape, Indian Rapes, Smart Sticker Rape Alaram, Smart Sticker Sexual Alaram

Smart Sticker detects, prevents sexual assault in real time. The smart sticker, developed by Manisha Mohan a MIT researcher, can issue alert by emitting a distress signal, while also sending out a text to one in five contacts.

రేప్ నుంచి తప్పించుకునేందుకు ఐడియా

Posted: 07/26/2017 09:15 AM IST
Smart sticker helps prevent sexual assault in real time

ప్రభుత్వాలు, చట్టాలు తమపై జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్న తరుణంలో టెక్నాలజీ సాయంతో అయినా కనీస రక్షణ కల్పించుకునేందుకు ఓ మహిళ ప్రయత్నం చేసింది. అదే స్మార్ట్ స్టిక్కర్ ను తయారు చేయటం. లైంగిక దాడులు జరిగిన సమయంలో ఇది అప్రమత్తమై మనకు కావాల్సిన వారికి సమాచారం అందిస్తుంది. ఇంతకీ దీనిని కనిపెట్టింది ఎవరో కాదు మన దేశానికి చెందిన యువతే.

అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) లో రీసెర్చర్ గా చేస్తున్న మనీషా మోహన్ ఈ అద్భుతమైన స్టిక్కర్‌ను అభివృద్ధి చేసింది. స్మార్ట్ స్టిక్కర్‌’గా పిలిచే దీనిని దుస్తుల్లో అతికించుకోవచ్చు. అలాగే బ్లూటూత్ ద్వారా ఫోన్‌లోని యాప్‌కు అనుసంధానం చేసుకోవచ్చు. మహిళపై వేధింపులు జరిగితే వెంటనే ఇది గుర్తించి ఐదు నంబర్లకు టెక్ట్స్ మెసేజ్ పంపిస్తుంది. ఇది ముమ్మాటికీ లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పిస్తుందని హామీ ఇస్తోంది.

 

ప్రస్తుత పరిస్థితుల్లో మహిళల భద్రత దృష్ట్యా వారిని బయటకు పంపించేందుకు ఇష్టపడడం లేదని, ఇంట్లో ఉండే పనులే చేసుకోవాలని ఒత్తిడి తీసుకొస్తున్నారని మనీషా చెబుతోంది. కానీ, ‘స్మార్ట్ స్టిక్కర్’తో ఎటువంటి భయం లేకుండా బయటకు వెళ్లవచ్చని చెబుతోంది. ఇప్పటికే ఈ స్టిక్కర్ పనితీరును 70 మందిపై పరీక్షించినట్టు చెబుతూ అందుకు సంబంధించిన ఓ వీడియోను అప్ లోడ్ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sexual Assault  Manisha Mohan  Smart Sticker  

Other Articles