జర్నలిస్టు వృత్తిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని ఉన్నత ఉద్యోగిగా ప్రముఖ న్యూస్ ఛానెల్ లో విధులు నిర్వహిస్తున్న సీనియర్ జర్నలిస్టు చేయకూడని పని చేసి.. కటకటాలు లెక్కిస్తున్నాడు. ప్రతి నిత్యం క్రైం వార్తలు రాసీ రాసీ.. వాటిపై కలాన్ని ఎక్కుపెట్టి పోరాడాల్సి వ్యక్తి.. అందుకు భిన్నంగా తనలోని క్రిమినెల్ స్వభావాన్ని నిద్రలేపాడు. తన కింద పనిచేస్తున్న సహుద్యోగిని పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి.. నయవంచన చేసి.. అమెను పెళ్లాడకుండా మోసం చేశాడు. దీంతో పోలీసులను అశ్రయించిన అమె లిఖిత పూర్వకంగా పిర్యాదు కూడా చేయడంతో సీనియర్ జర్నలిస్టుకు అరదండాలు పడ్డాయి.
ప్రముఖ మలయాళం న్యూస్ చానల్ మాతృభూమికి చెందిన సీనియర్ జర్నలిస్టుపై ఈ లైంగిక ఆరోపణలు.. నయవంచన చేసిన అరోపణలు కేరళ సహా దక్షిణాది రాష్ట్రాలలో కలకలం రేపాయి. పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి, లైంగికంగా లోబర్చుకుని, మోసంచేశాడన్న ఆరోపణలతో మాతృభూమి ఛానల్ సీనియర్ న్యూస్ ఎడిటర్ అమాల్ విష్ణుదాస్ ను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. సుదీర్ఘంగా విష్ణుదాస్ ను ప్రశ్నించిన అనంతరం అతన్ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. విష్ణుదాస్ పై అత్యాచారం సెక్షన్ 376, అసహజ నేరం కింది సెక్షన్ 377, దిరింపులకు పాల్పడిన నేరం కింది సెక్షన్ 506 కింద కేసులు నమోదు చేశామని తిరువనంతపురం సీఐ రియాజ్ తెలిపారు.
తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు డీసీపీకి పిర్యాదు చేసిందని, అమె పిర్యాదులో పేర్కోన్న కథనం ప్రకారం.. విష్ణుదాస్ కు ఇదివరకే వివాహమైందని అయితే ఆమెతో గొడవల కారణంగా విడాకులు ఇచ్చాడని.. దీంతో విడాకులు మంజూరు కాగానే తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి.. లొంగదీసుకున్నాడని పేర్కొంది. ఇక విడాకులు మంజూరైన తరువాత పెళ్లి మాట ఎత్తితే.. మొహం చాటేస్తున్నాడని, దాటవేత సమాధానాలతో కాలం వెల్లబుచ్చుతున్నాడని పేర్కొంది.
ఇక తాజాగా ఈ వ్యవహారాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయనీ, కరీర్ ను నాశనం చేస్తానని హెచ్చరించాడని, బెదిరింపులకు పాల్పడుతున్నాడని చెప్పింది. ఇక విష్ణుదాస్ తండ్రి వైద్య ఖర్చుల పేరుతో తన దగ్గర భారీ మొత్తంలో డబ్బులు కూడా తీసుకున్నాడని బాధితురాలు తన పిర్యాదులో పేర్కొనింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం అస్పత్రికి తరలించి.. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more