Nitish too faces serious criminal charges: Lalu Prasad హత్యకేసులో నిందితుడిగా వున్నందునే: లాలూ

Nitish kumar resigned because he faces serious criminal charges lalu prasad

Tejashwi Yadav, Tejashwi, Nitish Kumar, Murder, Lalu Prasad, Bihar chief minister, nitish kumar resigns, nitish kumar resigns as bihar cm, nitish kumar kills his son, nitish kumar ditches grand alliance, nitish kumar tejaswi yadav, Nitish Kumar, Tejashwi Yadav, Lalu Yadav, grand alliance, RJD, JDU, Congress, BJP

RJD chief Lalu Prasad said Nitish Kumar's resignation as Bihar CM was "pre-planned" as he has not ruled out the possibility of joining hands with the BJP.

నితీష్ రాజీనామా ముందస్తు ప్రణాళికే: లాలూ

Posted: 07/26/2017 09:57 PM IST
Nitish kumar resigned because he faces serious criminal charges lalu prasad

అనూహ్యరీతిలో ముఖ్యమంత్రి పదవికి నితీశ్ కుమార్‌ రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయనపై మిత్రపక్షం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహాకూటమి తనకు బిడ్డలాంటిదని, తన బిడ్డను తానే ఎందుకు చంపుకుంటాను అని ప్రశ్నించిన నితీశ్ కుమార్ ఇప్పుడెలా తన పదవికి రాజీనామా చేశారని ప్రశ్నించారు. తన ప్రాణమున్నంత వరకు బీజేపితో చేతులు కలపనని చెప్పిన నితీశ్ మాటలు నమ్మి తాను ఆయనతో మిత్రపక్షాన్ని ఏర్పాటు చేస్తే.. మిత్రధర్మానికి వెన్నుపోటు పోడిచి తన దారి తాను చూసుకున్నాడని అరోపించారు.

తేజస్వీ పై నమోదైన కేసులు ఈ నాటివి కావని తాను ఇదివరకే నితీశ్ కు చెప్పానని అన్నారు. అయినా వాటిపై వివరణ కోరడమేంటని ఆయన ప్రశ్నించారు. దర్యాప్తు సంస్థలకు తాము వివరణ ఇచ్చామని, ఈ విషయాలపై క్రితం రోజేనే తాను నితీశ్ తో సుమారు 40 నిమిషాల పాటు ఫోన్ ద్వారా సంభాషించానని చెప్పారు. అన్ని విషయాలు తనకు తెలుసునన్న నితీశ్.. ఇరవై నాలుగు గంటలు కూడా తిరగకుండానే తన పదవికి రాజీనామా చేశారని.. రాజీనామా చేసే ముందు మిత్రధర్మం గుర్తుకు రాలేదా.. తమకు చెప్పాలని అనిపించలేదా.. అని ప్రశ్నించారు.

అటు కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ నితీశ్ రాజీనామా చేయగానే ఇది శుభపరిణామని ఆయన ట్విట్ చేయడాన్ని చూస్తుంటే ఇదంతా నితీశ్ కుమార్, అటు ఆర్ఎస్ఎస్, ఇటు మోడీతో కలసి వేసుకున్న ముందస్తు ప్రణాళికేనని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. తామేం ఏం తప్పు చేశామో తెలియాలని ఆయన నితీశ్‌ను నిలదీశారు. అధికార మహాకూటమిలో ఆర్జేడీయే అతిపెద్ద పార్టీ అని, ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే మెజారిటీ తమకు ఉంని.. ఆర్జేడీ అభ్యర్థియే సీఎం అవుతారని అన్నారు. ఆరెస్సెస్ విముక్త భారతమే తన లక్ష్యమని చెప్పిన నితీశ్ కుమార్ తమను మోసం చేశారని మండిపడ్డారు.

అవినీతి ఆరోపణలు ఉండటం వల్లే తమతో తెగదెంపులు చేసుకుంటున్నానని నితీశ్ చేసిన వ్యాఖ్యలను లాలూ తోసిపుచ్చారు. స్వయంగా నితీశ్ కుమార్ పై హత్యారోపణలు ఉన్నాయని,అక్రమంగా ఆయుధాల కేసులు కూడా వున్నాయని..  అవినీతి కంటే హత్య ఘోరమైనదని దుయ్యబట్టారు. ఈ మేరకు ఈ విషయాలను అయన తన ఎన్నికల అఫిడెవిట్ లోనూ పోందుపర్చారని ఆయన తెలిపారు. రాజీనామా చేయొద్దని నితీశ్‌కు తాను సూచించానని, ఏమైనా అపార్థాలు ఉంటే చర్చించుకొని సయోధ్య కుదుర్చుకుందామని చెప్పినా ఆయన వినిపించుకోలేదని అన్నారు. రాజకీయ మనుగడ కోసమే నితీశ్‌ బీజేపీ-ఆరెస్సెస్‌తో చేతులు కలుపుతున్నారని దుయ్యబట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nitish Kumar  Tejashwi Yadav  Lalu Yadav  grand alliance  RJD  JDU  Congress  BJP  

Other Articles