భూటాన్, సిక్కిం సరిహద్దుల్లో ఉన్న డోక్లాం చైనా సైన్యం యవ్వారంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. బాల్ భారత్ కోర్టులోనే ఉందంటూ.. చెబుతూనే మరో పక్క పలు విధాలుగా బెదిరించేందుకు చైనా ప్రయత్నించింది. ఇందుకోసం అక్కడి మీడియా మాధ్యమాలు అన్నిరకాలుగా సాయం చేశాయ్ కూడా. పైగా చైనా మాట విని వెనక్కి తగ్గకపోతే కశ్మీర్ విషయంలో జోక్యం చేసుకుంటామని, యుద్ధం కూడా తప్పకపోవచ్చని హెచ్చరికలు జారీ అయ్యాయి.
అయితే బలం తక్కువగా ఉన్నప్పటికీ భారత్ మాత్రం 'దేనికైనా సై' అంటూ అంతే స్థాయిలో బదులిచ్చింది. సరిహద్దులో సైన్యం పాగా వేసి దూకుడు చూపించింది. ఇంతలో అగ్రరాజ్యం అమెరికా మనకు మద్ధతుగా నిలిచింది. దీంతో నిన్నటి దాకా కారు కూతలు కూసిన చైనా హఠాత్తుగా స్వరం మార్చింది. భారత్ తులనాడిన అదే మీడియా ఇప్పుడు పొగుడుతూ కథనాలు రాస్తోంది. మరీ ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల జల్లు కురిపించింది. జీఎస్టీ, తదితర నిర్ణయాలతో వాణిజ్య రంగాన్ని మోదీ పరుగులు పెట్టిస్తున్నారంటూ పేర్కొన్న గ్లోబల్ టైమ్స్ భారత ప్రభుత్వం అమలు చేస్తున్న బహిరంగ విదేశీ ఆర్థిక విధానాన్ని ప్రశంసించింది.
విదేశీ పెట్టుబడులను భారత్ అత్యధిక స్థాయిలో ఆకర్షిస్తోందని... పెట్టుబడులకు దేశాన్ని అనుకూలంగా మార్చిందని కితాబిచ్చింది. ఇక గత రెండేళ్లుగా విదేశీ పెట్టుబడులకు భారత్ స్వర్గధామంలా మారిందని చైనా అధికార వార్తా సంస్థ జిన్హువా ఓ కథనాన్ని ప్రచురించింది. మోదీ నాయకత్వంలో క్రియాశీల విదేశాంగ విధానం అమలవుతోందని కితాబిచ్చింది. భారత్-చైనాల మధ్య బహిరంగ వాణిజ్య విధానం, వాణిజ్య సహకారాన్ని పెంపొందిస్తే... ప్రపంచంలోని స్వీయ సంరక్షణ విధానాలకు అడ్డుకట్ట వేయవచ్చని అభిప్రాయపడింది. అయితే, సరిహద్దు అంశాన్ని సాకుగా చేసుకుని అమెరికా భారత్ ను రెచ్చగొడుతూ.. ఇరు దేశాల మధ్య చిచ్చు పెట్టేందుకు యత్నిస్తోందంటూ మండిపడింది. ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక స్వీయ సంరక్షణ విధానాలకు ప్రాధాన్యత ఇస్తూ ఇతర దేశాలను తొక్కిపడేయాలని తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more