మాజీ మంత్రి కొడుకు పై కాల్పులు.. అనుమానాలు! | Gun Firing on Telangana Ex Minister's Son

Gun fire at telangana congress leader son

Vikram Goud, Vikram Goud Fire, Gun Fire Vikram Goud, Telangana Ex Minister Mukesh Goud, Mukesh Goud Son, Gun Fire on Vikram Goud, Congress Leader Vikram Goud, Hyderabad Gun Fire, Fire on Congress Leader Son

Gun Firing on Telangana Congress Leader, Ex Minister Mukesh Goud Son Vikram Goud. 2 Bullets in removed from Victim Body, no Danger.

ముకేష్ కొడుకుపై కాల్పులు.. డౌట్లు

Posted: 07/28/2017 08:21 AM IST
Gun fire at telangana congress leader son

కాల్పుల కలకలంతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాంగ్రెస్ సీనియర్ నేత అయిన ముకేశ్ గౌడ్ కుమారుడు విక్రమ్‌గౌడ్‌పై శుక్రవారం తెల్లవారుజామున కాల్పులు జరిగాయి. గుర్తు తెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. రెండు బులెట్లు ఆయన శరీరంలోకి దూసుకెళ్లగా, ప్రాణాపాయం ఏం లేదని జూబ్లీ హిల్స్ అపోలో వైద్యులు తెలిపారు.

బంజారాహిల్స్‌లోని రోడ్ నంబరు 86లో విక్రమ్ గౌడ్ ఇళ్లు ఉంది. గురువారం అర్థరాత్రి ఇంటికి వచ్చిన విక్రమ్ నేడు ఇంట్లో నిర్వహించే ఓ పూజకు హాజరుకావాల్సి ఉంది. పొద్దునే 3:20 కి లేచి అందుకు సిద్ధం అవుతుండగా, ఓ ఆగంతకుడు ఇంట్లోకి వచ్చి కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. విక్రమ్ చేయి, కడుపులోకి బులెట్లు చొచ్చుకుపోయినట్టు సమాచారం. కాల్పుల శబ్దం విని బయటకు వచ్చిన భార్యకు రక్తపు మడుగులో పడి ఉన్న భర్తను హుటాహుటినా ఆస్పత్రికి తరలించగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కాల్పుల ఘటనపై పూర్తి వివరాలు సేకరించే పనిలో పడ్డారు.

 

ఇక ఈ కాల్పుల వ్యవహారంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమైన విక్రమ్ నోరు విప్పకపోవడంతో సిబ్బందిని ప్రశ్నించే పనిలో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా తగిలిన బులెట్ కుడి చేతి నుంచి ఎడమ చేతి వైపు దూసుకెళ్లడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు డీసీపీ వెంకటేశ్వరరావు. లైసెన్స్ లేని తుపాకీని ఇంట్లో స్వాధీనం చేసుకోవటం కూడా విశేషం. ఇక కాల్పులు జరిపిన సమయంలో ఎవరు వచ్చారు? అన్న అంశాలపై విచారణ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. నిందితుడిని పట్టుకునేందుకు ఇప్పటికే నాలుగు బృందాలను రంగంలోకి దింపినట్టు పేర్కొన్నారు.

ఆ గొడవే కారణమా?

విక్రమ్ గౌడ్ గురువారం రాత్రి ఇంటికి వచ్చే ముందు ఎవరితోనో గొడవ పెట్టుకుని వచ్చినట్టు తెలుస్తోంది. కోపంతో రగిలిపోయిన ఆ వ్యక్తే నేరుగా ఇంటికి వచ్చి కాల్పులు జరిపినట్టు అనుమానిస్తున్నారు. కాల్పులు జరిపిన అనంతరం పరారైన అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోపక్క కుటుంబ కలహాలే కాల్పులకు కారణం అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Mukesh Goud Son  Vikram Goud  Gun Fire  

Other Articles