వెంకయ్యకు అంతా హ్యాండ్ ఇస్తున్నారుగా... | BJP Alliance No Support to Its VP Candidate

Jdu bjd support upa candidate in vp elections

JDU No Venkaiah Naidu, Venkaiah Naidu Tough Fight VP Elections, VP Elections, Vice President Elections, UPA Candidate VP Elections, India Vice President Elections

Despite alliance with BJP, Nitish Kumar not to vote for Venkaiah in Vice President polls. senior party leader K.C. Tyagi Confirmrd it.

వెంకయ్యకు మద్ధతు అస్సలు ఇవ్వం

Posted: 07/31/2017 02:08 PM IST
Jdu bjd support upa candidate in vp elections

బీజేపీ కొత్త మిత్రపక్షం జేడీ(యూ) ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాత నిర్ణయాన్నే అమలు చేయాలని నిర్ణయించుకుంది. మహా ఘటబంధన్ ను బద్దలు కొట్టి, ఆర్జేడీ, కాంగ్రెస్ లకు టాటా చెప్పి, ముచ్చటగా మూడు రోజుల తరువాత కూడా ఈ నిర్ణయానికి రావటం విశేషం.

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే తరఫున నిలబడిన వెంకయ్యనాయుడికి తమ పార్టీ మద్దతివ్వబోదని, కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ తరఫున నిలబడ్డ గోపాలకృష్ణ గాంధీకే తమ పార్టీ సభ్యులు ఓట్లు వేస్తారని జేడీ(యూ) తేల్చి చెప్పింది. కూటమి నుంచి విడిపోవడానికి ముందే తాము గాంధీకి మద్దతివ్వాలని నిర్ణయించుకున్నామని, దానిలో మార్పు వద్దని నితీశ్ కుమార్ నిర్ణయించారని, పార్టీ అధికార ప్రతినిధి కేసీ త్యాగి నేడు మీడియాకు వెల్లడించారు. ఇదే విషయాన్ని బీజేపీకి కూడా స్పష్టం చేయనున్నామని వెల్లడించారు.

ఇక ఒడిశా బీజేడీ కూడా గోపాలకృష్ణ గాంధీకే తమ మద్ధతు అన్న సంకేతాలను పంపించి వేసింది. ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ మేరకు వెంకయ్యకు మద్ధతు ఇవ్వబోమని స్పష్టం చేశాడు. నేడు గోపాలకృష్ణ గాంధీ పట్నాయక్ తో భేటీ నేతృత్వంలో అది దాదాపు ఖరారైనట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vice President Elections  Venkaiah Naidu  JDU  UPA Candidate  Gopal Krishna Gandhi  

Other Articles