సరికొత్త ట్రాఫిక్ రూల్స్ తో హైదరాబాద్ లో వాహనదారులకు నేటి నుంచి చుక్కలు చూపించబోతుంది ట్రాఫిక్ శాఖ. ఉల్లంఘనను బట్టి పాయింట్ల విధానంలో కోతవేయనున్నారు. 12 పాయింట్లు దాటితే అతిక్రమించిన వాళ్ల లైసెన్స్ రద్దు చేయనున్నారు. దేశంలోనే ప్రయోగాత్మకంగా తెలుగు రాష్ట్రంలోనే ఈ రూల్స్ తేవటం విశేషం. లైసెన్స్ దాటాక కూడా మళ్లీ వాహనం నడిపితే మాత్రం జైలు ఊచలు లెక్కించాల్సిందే. ఇప్పటికే ఈ విధానంపై ట్రయల్ రన్ నిర్వహించి సక్సెస్ అయిన అధికారులు పూర్తి స్థాయిలో నేటి నుంచి అంటే ఆగష్టు 1 నుంచి అమలు చేయనున్నారు.మద్యం తాగి ప్రజా రవాణా వాహనాలు నడిపితే 5 పాయంట్లు,
దోపిడీలు, స్నాచింగ్ లకు వాహనాలు వినియోగిస్తే 5 పాయింట్లు,
వాహనాలు నడుపుతూ వ్యక్తుల మరణానికి కారణమైతే 5,
మద్యం తాగి కార్లు, భారీ వాహనాలు నడిపితే 4 పాయింట్లు,
తాగి బైక్ నడిపితే 3 పాయింట్లు,
అలాగే 40 కిలోమీటర్ల వేగాన్ని మించితే 3 పాయింట్లు విధించనున్నారు. రేసింగ్ లో పాల్గొన్నా, మితిమీరిన వేగంతో వెళ్తున్నా 3 పాయింట్లు, నిబంధనలకు విరుద్ధంగా వాహనాల్లో ప్రయాణికులను తరలిస్తే 2 పాయింట్లు, రాంగ్ సైడ్ డ్రైవింగ్ కు 2 పాయింట్లు, వాయు, శబ్దకాలుష్యం వెదజల్లే వాహనాలకు 2 పాయింట్లు, వాహనాలకు సరైన పత్రాలు లేకుండా డ్రైవింగ్ చేస్తే 2 పాయింట్లు విధిస్తారు. రోడ్డు ప్రమాదంలో బాధితులు గాయాలపాలైతే రెండు పాయింట్లు విధించనున్నారు. ఆటోడ్రైవర్లు తమ పక్కన ప్రయాణికులను కూర్చోబెట్టుకుంటే ఒక పాయింట్ విధిస్తారు. సీట్ బెల్టు లేదా హెల్మెట్ పెట్టుకోని పక్షంలో కూడా ఒక పాయింట్ విధిస్తారు. ఇలా మొత్తం 12 పాయింట్లు అయ్యే దాకా చూసి ఆపై వాళ్ల లైసెన్స్ ను రద్దు చేసి పడేస్తారు. సో.. తస్మాత్ జాగ్రత్త!
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more