నమాజ్ టైంలో ఊహించని పరిణామం.. 30 మృతి.. వందల్లో గాయాలు | Deadly Explosion in Mosque Kills Dozens

Suicide bomber targets shia mosque in herat city

Afghanistan, Afghanistan Mosque Blast, Mosque Terror Attack, Shiite Mosque, Herat Mosque Terror Attack, Herat Mosque Blast, Masjid Terror Attack, Mosque Blast, Afghanistan Mosque Blast, Suicide Bomber Attack, Massive blast at Mosque, Tehran Mosque, Blast Islam Prayer

Massive blast at mosque. 20 Killed, 30 Injured in a Deadly Explosion in Shia Mosque in Herat.

కాల్పులు: నెత్తురోడిన మసీదు

Posted: 08/02/2017 08:18 AM IST
Suicide bomber targets shia mosque in herat city

ఉగ్రవాది కాల్పులు, ఆపై సూసైడ్ బాంబ్ దాడితో విరుచుకుపడటంతో ఆఫ్ఘనిస్థాన్ నేల మరోమారు రక్తసిక్తమైంది. షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని మసీదులో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 29 మంది బలికాగా, 64 మంది తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం అర్థరాత్రి హెరాత్ నగరంలోని డెహర్ అబాద్ ప్రాంతంలోని జవాడియా మసీదులోఇది చోటుచేసుకుంది.

మంగళవారం సాయంత్రం మసీదులో ప్రార్థనలు జరుగుతుండగా, తుపాకీతో ప్రవేశించిన ఓ ఉగ్రవాది ద్వారం వద్ద ఉన్న భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపి చంపాడు. అనంతరం లోపలికి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడి చివరకు పేల్చేసుకుని ఆత్మాహుతి దాడి చేశాడు. ఆ సమయంలో మసీదులో 300 మందికి పైగా ప్రార్థనలో పాల్గొన్నారని మోహదీ హదీద్ అనే మత ప్రవక్త తెలిపాడు. మరణించిన వారి సంఖ్య 100కు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.

పేలుడు ధాటికి మసీదు మొత్తం దారుణంగా దెబ్బతింది. మృతదేహాలు, ఛిద్రమైన అవయవాలు చెల్లాచెదురుగా పడి ఉండటం.. మొత్తం భీతావహంగా మారింది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దాడికి సంబంధించి ఇప్పటి వరకు ఉగ్రవాద సంస్థా బాధ్యత ప్రకటించలేదు. మైనార్టీలైన షియాలపై తరచూ దాడులకు తెగబడుటుండటంతో అక్కడి ప్రభుత్వం ప్రత్యేక భద్రతను కల్పిస్తూ వస్తోంది. అయినా ఈ దాడి చోటు చేసుకోవటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Afghanistan  Mosque Blast  

Other Articles