హైదరాబాద్ వాసుల ట్రాపిక్ కష్టాలకు అందుబాటులోకి వచ్చిన ఓ చక్కని పరిష్కారం త్వరలో అవిష్కృతం కాబోతుంది. గత అరేడేళ్లుగా ఎదురుచూస్తున్న హైదరాబాద్ వాసులకు ఇదిగో అదిగో అంటూ ఎప్పటికప్పుడు అశలు కల్పిస్తూనే.. వాయిదాలతొ కాలం గడిసేస్తంది. అయితే ఇన్నాళ్లుగా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన నగరవాసుల కల ఎట్టకేలకు ఫలించబోతోంది. హైదరాబాద్ మెట్రో రైలు పరుగుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే పలుమార్లు వాయిదాలు వేసుకున్న నేపథ్యంలో ఈసారి డేట్ ను కూడా ఫిక్స్ చేసేసింది మెట్రో రైలు సంస్థ.
నూతన సంవత్సర కానుకగా, సంక్రాంత్రి పర్యదినానన్ని పురస్కరించుకుని వచ్చే ఏడాది జనవరి 3వ తేదీని మెట్రో రైలు కూతకు సిద్దం అవుతుంది. నగరవ్యాప్తంగా మొత్తం రైలు మార్గం పూర్తైన తరువాతే దానిని వినియోగంలోకి తీసుకువస్తామని గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అయితే అందుకు భిన్నంగా కేవలం రైలు మార్గంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా సంపూర్ణంగా పనులు పూర్తైన మియాపూర్-అమీర్ పేట్, నాగోల్, బేగంపేట్ కారిడార్లలోనే మెట్రో రైలు కూతలు వినిపించనున్నాయి. ఆ తరవాత మెట్రో సేవలను క్రమంగా విస్తరించనున్నారు. మెట్రో రైలు సేవలను హైదరాబాద్ వాసులకు అందుబాటులోకి తీసుకురానున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఆయన ఈ మెట్రో సేవలను జనవరి 3న ప్రారంభించనున్నారు.
జనవరి నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ మెట్రో రైలును ప్రారంభించాలని యోచిస్తున్న ప్రభుత్వం పనులను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించింది. ఈ కారణంగానే నగరంలో పనులు ఊపందుకున్నాయి. ఎక్కడికక్కడ రోడ్లు బ్లాక్ చేసి, ట్రాఫిక్‌ను మళ్లించి మరీ రాత్రీపగలు తేడా లేకుండా పనులు చేస్తున్నారు. అమీర్‌పేట, సికింద్రాబాద్‌లోని ఒలిఫెంటా బ్రిడ్జి వద్ద ట్రాఫిక్‌ను దారి మళ్లించి పనులు పూర్తి చేస్తున్నారు. ఒలిఫెంటా వద్ద ఏర్పాటు చేస్తున్న ఉక్కు వంతెన నిర్మాణం పూర్తయితేనే నాగోలు నుంచి బేగంపేట మార్గంలో రైలు నడిపే అవకాశం ఉంది.
నవంబరు కల్లా మిగిలిన పనులు పూర్తి చేసి డిసెంబరులో ట్రయల్స్ నిర్వహించి జనవరిలో ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అమీర్‌పేట వద్ద రైలు మార్పిడి స్టేషన్ నిర్మించాల్సి ఉంది. దీని నిర్మాణాన్ని కొనసాగిస్తూనే మియాపూర్-అమీర్‌పేట మధ్య రైలు నడపాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. కాగా, నగరంలోని మిగతా రూట్లలోనూ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. ప్రస్తుతం మూడు కోచ్‌లతో ఉన్న 53 మెట్రో రైళ్లు నగరానికి చేరుకున్నాయి. మెట్రోరైలు ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్రమోదీని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఆహ్వానించినట్టు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more