Jet Airways announces Independence Day sale జెట్‌ ఎయిర్ వేస్‌ స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్..

Jet airways offers independence day discounts on business economy base fares

Independence day sale, jet airways discounts, Independence day, Jet Airways, Jet, jet airlines, jet offers on business class, jet offers on economy tickets, low fares from jet airways, discounts on jet airways

Jet Airways has launched a six-day celebratory fare sale to mark the 70th Independence Day. The sale will start from Friday and offer 30% and 20% discount on base fares of economy and business classes.

జెట్‌ ఎయిర్ వేస్‌ స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్..

Posted: 08/11/2017 09:14 PM IST
Jet airways offers independence day discounts on business economy base fares

దేశ 70వ స్వాంతంత్య్ర దినోత్సవ వేడుకులను పురస్కరించుకుని అనేక వాణిజ్య సంస్థలతో పాటు ఈ కామర్స్ సైట్లు కూడా అఫర్లు ప్రకటిస్తున్న తరుణంలో అదే ఒరవడిని కొనసాగిస్తూ.. చౌకధర విమానయాన సంస్థగా పేరొందిన జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ కూడా అపర్లను ప్రకటించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తమ విమాన టిక్కెట్లను రాయితీపై అందించనుంది. ఇవాళ్టి నుంచి ఆరు రోజుల పాటు జెట్ ఎయిర్ వేస్ రాయితీ అమ్మకాలను తమ కస్టమర్లకు అందుబాటులో వుంచనుంది.

ఎకానమీ, బిజినెస్‌ క్లాస్‌ టిక్కెట్‌ ధరపై 30%, 20% రాయితీని ఇస్తోంది. తన నెట్‌వర్క్‌ పరిధిలోని 44 దేశీయ గమ్యస్థానాలకు, 20 అంతర్జాతీయ గమ్య స్థానాలకు స్వాతంత్య్ర దినోత్సవ రాయితీలు వర్తిస్తాయని ప్రకటించింది. దేశీయ విమానాల్లో ప్రయాణానికి టిక్కెట్లు కొనుగోలు చేసినవారికి సెప్టెంబరు 5 వరకు రాయితీ వర్తిస్తుందని పేర్కొంది. అంతర్జాతీయ విమాన సర్వీసులకు సెప్టెంబరు 15 వరకు వర్తింపజేసింది.

భారత స్వాంతంత్య్ర దినోత్సవ వేడుక ప్రపంచ దేశాల్లో నివసిస్తున్న భారతీయులకు ప్రత్యేకమైన పండగ వంటిదని జెట్‌ఎయిర్‌వేస్‌ చీఫ్‌ కమర్షియల్‌ అధికారి జయరాజ్‌ షణ్ముగన్‌ పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాయిుతీ ధరలపై టిక్కెట్లు విక్రయించడాన్ని తాము గొప్పగా భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jet airways  jet airlines  independence day offer  jet airways tickets offer  

Other Articles