reliance jio paytm - Google Search రిలయన్స్ జియో మరో బంఫర్ ఆఫర్..

Jio recharge amazon paytm flipkart offer cashback of up to rs 99

reliance jio recharge, reliance jio plan, reliance jio offer, reliance jio, Jio recharge, Jio plan, Jio Offer, Jio tariff, reliance jio phonepe, reliance jio amazon pay, reliance jio paytm, reliance jio recharge paytm, reliance jio recharge amazon, reliance jio recharge phonepe, reliance jio wallet, reliance jio wallet recharge, reliance jio flipkart, jio flipkart, jio amazon, jio amazon pay, jio recharge pack, jio data, jio data pack, reliance jio res 399, reliance jio rs 349, reliance jio recharge, PhonePe, PayTM, Jio recharge offer, jio recharge, jio offer, Flipkart, Amazon Pay

Reliance Jio is now offering cashback to consumers on recharges. You can get one by using Amazon, Paytm and Flipkart’s Phonepe.

రిలయన్స్ జియో మరో బంఫర్ ఆఫర్..

Posted: 08/16/2017 12:17 PM IST
Jio recharge amazon paytm flipkart offer cashback of up to rs 99

దేశీయ టెలికాం దిగ్గజ సంస్థలకు వెన్నులో వణుకు పుట్టిస్తున్న రిలయన్స్‌ జియో మరో బంపర్‌ ఆఫర్‌తో ముందుకొచ్చింది. ఇన్నాళ్లు పలు పేర్లతో పథకాలను తీసుకువచ్చి దేశ ప్రజలకు ఉచితంగా డాటా సేవలను అందించడంతో పాటు వాయిస్ కాల్స్ కు ఒక్క రూపాయి కూడా వసూలు చేయని జియో.. తాజాగా తన పంథాను మార్చుకుని మరో మార్గంలో కస్టమర్లను అకర్షించేందుకు భారీ బంఫర్ ఆఫర్లను తీసుకువచ్చింది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్, పేటీఎం, ఫోన్‌ పే ద్వారా రీచార్జ్ చేసుకున్న తమ కస్టమర్లకు క్యాష్ బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది.

రిలయన్స్ జియో కస్టమర్లకు ఈ కామర్స్ సైట్లు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లలో భారీగా క్యాష్ బాగ్ అఫర్ వర్తించనున్నాయి. వాటితో పాటు ఇటు పేటీఎం, ఫోన్‌ పే యాప్‌ల ద్వారా రీచార్జిలపై కూడా క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ అందిజేస్తుంది జయో. జియోను తొలిసారిగా అమెజాన్ ద్వారా రీచార్జ్ చేసుకునే వారికి రూ.99 రూపాయల క్యాష్ బ్యాక్ వర్తింపజేస్తుంది. రీచార్జ్ చేసుకున్న వారం రోజుల వ్యవధిలో డబ్బులు తమ అమెజాన్ పే ఖాతాలలోకి చేరుతాయని అమెజాన్ యాజమాన్యం తెలిపింది. కాగా, దీంతో పాటు నవంబర్ వరకు అడ్ ఆన్ ఆపర్లు వేసుకునే కస్టమర్లకు 20 శాతం మేర రాయితీ కూడా అందిస్తుంది.

అటు పేటీఎం ద్వారా అయితే రూ.300 రీచార్జీపై రూ.76ల క్యాష్ బ్యాక్ అందిస్తుండగా, రూ.100 రీచార్జీపై రూ. 15 క్యాష్ బ్యాక్ అందిస్తుంది. పేటియంజియో అన్న ప్రోమో కోడ్ ను వినియోగించుకుని కస్టమర్లు ఈ క్యాష్ బ్యాక్ అఫర్ ను వినియోగించుకునే అవకాశం వుంటుంది. పేటీఎం యాప్‌లో 'మొబైల్ ప్రీపెయిడ్' లేదా 'మొబైల్ పోస్ట్‌ పెయిడ్' అప్షన్స్‌ను ఎంచుకుని జియో ఫోన్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేసి 'ప్రోగ్రెస్ టు రీఛార్జ్'పై క్లిక్ చేయాలి. ఆ తరువాత ప్రోమో కోడ్‌నుకూడా జతచేయాలి. దీంతో రీచార్జ్‌ పూర్తవుతుంది. రీఛార్జ్ చేసుకున్న 24 గంటల్లో నగదు వారి పేటీయం అకౌంట్లలో జయచేయబడుతుందని తెలిపింది. ఇక ఫోన్ పే యాప్ ద్వారా రీచార్జ్ చేసుకున్న కస్టమర్లకు రూ.75 క్యాష్ బ్యాక్ అఫర్ లభించనుంది.

 

ఫ్రీ ఫోన్ డిపాజిట్ ముందుగానే...

దాదాపు ఉచితమే అంటూ రిల‌య‌న్స్ అధినేత ముఖేష్ అంబాని ప్ర‌క‌టించిన జియో 4జీ ఫీచ‌ర్‌ మొబైల్ ఫోన్లు త్వ‌ర‌లోనే వినియోగ‌దారుల‌కు అంద‌నున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లు రిల‌య‌న్స్ రిటైల్ దుకాణాల్లో ప్రారంభ‌మైన ఈ ఫోన్ల బుకింగ్‌లు ఈ నెల 24 నుంచి మై జియో యాప్‌లోనూ ప్రారంభం కానున్నాయి. అయితే ఈ ఫోన్ కావాలంటే తొలుత రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మూడేళ్ల తరువాత ఆ రూ.1500ను రిలయన్స్ తిరిగి ఇచ్చేస్తుంది. అయితే, ఓ జాతీయ దిన‌ప‌త్రిక‌ కథనం ప్రకారం జియో ఫోన్ కోసం ఇచ్చిన ఆ సెక్యూరిటీ డిపాజిట్ల‌ను వినియోగ‌దారులకు రిల‌య‌న్స్‌ మూడు సంవత్సరాల కంటే ముందే చెల్లించాల‌ని భావిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jio recharge offer  Reliance Jio  cash back Offer  Paytm  PhonePe  Amazon  

Other Articles