ప్రపంచ ప్రఖ్యాతిగాంచి.. అద్భుత వారసత్వ సంపదగా నిలుస్తున్న అందమైన కట్టడాల్లో ఇప్పటికీ తన పేరును అగ్రభాగన నిలిపింది తాజ్ మహల్. నేటికీ ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులను అకర్షిస్తున్న ఒక అద్భుత చారిత్రక కట్టడంగా నిలిచింది. ఈ విషయాలు మీకు తెలియవా..? అంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చింది. ఈ విషయాలు తెలిసి కూడా తాజ్ మహల్‌ను నాశనం చేయాలని అనుకుంటున్నారా? అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
తాజ్ పరిసర ప్రాంతాలను రక్షించి అద్భుత కట్టడ అందాలను పరిరక్షించాలని కోరుతూ పర్యావరణవేత్త మెహతా.. గతంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉత్తర్ ప్రదేశ్ లోని మథుర నుంచి ఢిల్లీ వరకూ అదనంగా ఏర్పాటు చేసే రైల్వే ట్రాక్ కోసం దాదాపు 400కి పైగా చెట్లను తొలగించనున్నారు. దాని వల్ల పర్యావరణానికి ఎంతో హాని కలగడంతో పాటు, దాని ప్రభావం చారిత్రక కట్టడంపై కూడా పడనుంది. దీంతో ఈ విషయంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
‘తాజ్‌మహల్ ప్రపంచంలోనే అద్భుతమైన కట్టడాల్లో ఒకటి. దాన్ని ప్రభుత్వం నాశనం చేయాలనుకుంటుందా? ప్రస్తుతం తాజ్‌మహల్ ఎలా ఉందనే దానికి సంబంధించిన ఫొటోలను అసలు చూశారా? ఆన్లైన్లో తాజ్ ఫొటోలు చూడండి.. ఎలా ఉందో కనిపిస్తుంది’ అని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మదన్ బీ లోకుర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యింది. ఒక వేళ అదే చేయాలనుకుంటూ కేంద్ర ప్రభుత్వం తాజ్ మహాల్ ను నాశనం చేయాలనుకుంటుంది అని ఓ అఫిడెవిట్ దాఖలు చేయండీ అని ధర్మాసనం అగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more