మానవ సంబంధాలన్నీ మనీ చుట్టూ తిరుగుతున్నాయని ఎందరో చెప్పినా.. మళ్లీ మళ్లీ అదే ఎదురువుతూ మనిషి కన్నా మనీకే విలువెక్కువని చాటుతుంది. ఫలితంగా మనీ కోసం పండంటి జీవితాలను కూడా బుగ్గిపాలు చేస్తున్నాయి. హైదరాబాద్ యువకులకు డిమాండ్ ఎక్కవై వారు అడిగినంత కట్నం ఇచ్చుకోలేక పేదరికంలో మగ్గుతున్న కుటుంబాలు తమ బిడ్డలకు విదేశీ షేక్ లను చూస్తూ.. వారికిచ్చి పెళ్లి చేసి.. చేతినిండా అడిగినంత డబ్బును సమకూర్చుకుంటున్న ఘటనలు అనేకం మన పాతబస్తీలో చూశాం.
1991లో నగరానికి చెందిన 12 ఏళ్ల అమీనా కేసు గుర్తుందా..? ఈ బాలికను కూడా వయోవృద్దుడైన సౌదీ అరేబియా షేక్ కు ఇచ్చి వివాహం చేసి పంపించగా, పెళ్లి కూతురు వేషంలో.. రోదిస్తున్న చిన్నారి చూసి గుర్తించిన ఎయిర్ హాస్టెస్ అమిత్రా అహ్లూవాలియా బాలికను రక్షించి షేక్ ను పోలీసులకు అప్పగించింది. దీంతో హైదరాబాద్ లో అమ్మాయిల విక్రయాలు వెలుగుచూశాయి. ఆ తరువాత కూడా అనేక మంది బాలికలు నిఖా పేరుతో విదేశాలకు తరలివెళ్లారు. ఖాజీల సమక్షంలో జరగాల్సిన వివాహాలు కపట ఖాజీలతో జరిపించి మమ అనిపించి బాలికలను అంటగట్టేసి.. చేతిలో పడ్డ డబ్బును లెక్కబెడుతున్నారు. దీనిపై వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా వున్న హాయంలో.. ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. వివాహాలు చేసే ఖాజీలు నుంచి పాతబస్తీలో తల్లిదండ్రులకు అవగాహన కల్పించింది.
తాజాగా మళ్లీ అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఈ సారి తల్లిదండ్రలు కాకుండా అమ్మాయిలను అమ్మి అప్పనంగా వచ్చే డబ్బును అందుకోవాలని మేనత్త వేసిన పథకంతో ఓమన్ లో 16 ఏళ్ల బాలిక కష్టాలు పడుతుంది. డబ్బుకు కక్కుర్తిపడి ఒమన్‌కు చెందిన 65 ఏళ్ల అరబ్ షేక్‌తో బాలిక పెళ్లి జరిపించింది. ప్రతిఫలంగా రూ.5 లక్షలు తీసుకుంది. బాలిక పట్ల అరబ్ షేక్ లైంగిక దాడులకు పాల్పడి.. దాష్టీకాలు చేస్తుండటంతో బాలిక తన బాధను వుండబట్టుకోలేక తన కన్నతల్లికి ఫోన్ చేసి చెప్పుకుంది. కన్నబిడ్డ కోసం తల్లడిల్లుతున్న ఆ తల్లి తన బిడ్డను తనకు అప్పగించేలా, స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతటితో అగకుండా విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాందీలను కూడా కోరింది.
వివరాల్లోకి వెళ్తే.. ఫలక్ నుమా నవాబ్ సాబ్ కుంటకు చెందిన సయ్యద్ అఫ్సర్, సయిదున్నిసాలకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. అఫ్సర్ స్థానికంగా గల ఓ ఫంక్షన్ హాల్లో దినసరి కూలాగా పనిచేస్తుంటాడు. వారు అనుభవించే పేదరికం నుంచి బయటపడే చాన్స్ ఉందని, అరబ్ షేక్ తో వారి కుమార్తె నిఖా చేస్తే పెద్దఎత్తున డబ్బులొస్తాయని అఫ్సర్ కు అతడి సోదరి తీగలకుంటకు చెందిన గౌసియా బేగం, ఆమె భర్త సికిందర్ ఆశ చూపారు. అందుకు బాలిక తల్లిదండరులు నిరాకరించారు. దీంతో రూటు మార్చిన గౌసియా దంపతులు బాలికను త్వరగా ప్రలోభాలకు గురి చేయవచ్చాని భావించారు.
బాలికకు అరచేతిలో వైకుంఠం చూపించి వారికి లభించే డబ్బును కొట్టేసేందుకు పథకం వేశారు. ఇక నీకు చక్కని జీవితం లభిస్తుంది. కార్లు, విమానాల్లో తిరగడం ఇక మహారాణి యోగం పడుతుందని బాలికను ప్రలోభాలకు గురిచేశారు. మేనత్త మాటలకు బాలిక తలొగ్గడంతో ఒమన్‌లో వున్న అహ్మద్ (65) అనే వ్యాపారిని హైదరాబాద్ రప్పించారు. వివాహ విషయం బయటకు పొక్కితే నష్టం కల్గుతుందని భావించిన గౌసియా దంపతులు.. బార్కస్ సమీపంలోని ఓ హోటల్ గదిలో గౌసియా బేగం స్నేహితులు హాజీ, అహ్మద్‌లతో కలసి రంజాన్ నెలలో అరబ్ షేక్ తో బాలిక వివాహం జరిపించారు. వివాహం పూర్తికాగానే వృద్దుడితో పాటు బాలికను అదే హోటల్ గదిలో 4 రోజులు అదే హోటల్ లో ఉంచారు.
షేక్ తిరిగి వెళ్లిన కొన్నాళ్లకు బాలికను ఒమన్ పంపించగా, కొన్నాళ్ల పాటు సవ్యంగానే సాగిన అమె జీవితం ఇక నరకప్రాయం అయ్యింది. అరబ్ షేక్ అమెను చిత్రహింసలకు గురిచేస్తూ.. నిత్యం నరకాన్ని తలపించేలా లైంగికదాడులు, మానసిక, బౌతిక దాడులు కూడా చేయడంతో.. తాను ఎదుర్కోంటున్న ఇబ్బందులను తట్టుకోలేక తన తల్లి సయిదున్నిసాకు ఫోన్‌చేసి విలపించింది బాలిక. ఆమె నేరుగా అరబ్ షేక్ తో కూడా మాట్లాడింది. తమ కూతర్ని పెళ్లి చేసుకునేందుకు తాను రూ.5లక్షలు పూ చిలుకు వరకు వెచ్చించానని, వాటిని తిరిగి ఇచ్చేస్తే తనాు తమ బిడ్డను భారత్ కు పంపుతానని షేక్ బదులిచ్చాడు.
దీంతో గౌసియా దంపతుల దురాగతం గురించి తెలుసుకున్న బాలిక తల్లి.. వారితో పాటు అరబ్ షేక్ పై ఫలక్‌నుమా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ బిడ్డను స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. తమ బిడ్డను తమకు అప్పగించాలని వేడుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరబ్ షేక్ తోపాటు సయీదున్నిసా, సికిందర్, హాజీ, అహ్మద్ లపై కేసు నమోదు చేశారు. కాగా, ఒమన్‌లోని షేక్ చెరలో చిక్కిన బాలికను విడిపించేందుకు చర్యలు చేపట్టాలని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ను మరో కేంద్రమంత్రి మేనకాగాంధీ కోరారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more