దేశంలోని వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. అక్టోబర్ మాసంతో ముగియాల్సిన క్యాష్ బ్యాక్ ఆఫర్ ను మరో ఆరుమాసాల పాటు పొగడిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. నవంబర్ 8న పాత నోట్ల రద్దు తరువాత ఆ నిర్ణయంపై మిశ్రమ స్పందనలు వెల్లువెత్తినా వ్యతిరేకతే అధికస్థాయిలో వ్యక్తమైన క్రమంలో.. అనూహ్యంగా డిజిటల్ మనీ, క్యాస్ లెస్ ట్రాన్స్ యాక్షన్స్ అన్న నినాదాన్ని ఎత్తుకున్న కేంద్రం.. ఆ దిశగా అడుగులు వేసింది. ఇందుకోసం ఇటు దేశ ప్రజలకు, అటు వర్తకులకు లాభం కలిగించే విధంగా అప్పటికే అందుబాటులో వున్న యాప్ లను కాదని కొత్తగా భీమ్ యాప్ ను తీసుకువచ్చింది.
ఈ భీమ్ యాప్ ద్వారా క్యాష్ బ్యాక్ స్కీమ్ కింద వస్తువులు తీసుకునే ప్రజలకు పెద్దగా లాభం లేకపోయినా.. వ్యాపారులకు మాత్రం లాభాన్ని కలిగిస్తుంది. వ్యాపారులు కూడా డిజిటల్ లావాదేవాలకు మొగ్గచూపితే తప్ప మార్పు రాదని భావించిన కేంద్రం.. వారికి ఈ యాప్ ద్వారా జరిగిన లావాదేవీలకు ప్రోత్సహాకాలను కూడా వర్తింపజేస్తుంది. అయితే ఈ యావ్ వినియోగంపై విసృత ప్రచారం జరగకపోవడంతో అశించన మేరకు ఫలితాలు మాత్రం రావడం లేదు. ఈ అక్టోబర్ మాసంతో ఈ యాప్ ద్వారా ఇచ్చే ప్రోత్సహకాలు ముగుస్తున్న కారణంగా.. కేంద్రం దీనిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావించి ప్రోత్సాహకాలను మరో అరు మాసాల పాటు పొడిగించింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా ఈ ఏడాది ఏప్రిల్ 14న అందరికీ అందుబాటులోకి వచ్చిన భీమ్ యాప్.. 2018 మార్చి 31 వరకు భీమ్ క్యాష్ బ్యాక్ స్కీమ్ లను అందించనుంది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ యాప్ ద్వారా కేంద్రం ప్రోత్సాహకాలను క్యాష్ బ్యాక్ ఆఫర్ ద్వారా అందిస్తుంది. ఈ స్కీమ్ కింద ఒక్కో లావాదేవీకి రెండు రూపాయల చోప్పున కేంద్రం వీరికి క్యాప్ బ్యాక్ అందిస్తుంది. భీమ్ క్యాష్ బ్యాక్ స్కీమ్ నెలవారీ పరిమితి వెయ్యి రూపాయలు. ఈ క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలను వర్తకులు పొందడానికి, భీమ్ యూనిక్ యూజర్ల నుంచి వర్తకులు ప్రతి నెలా కనీసం 20 లావాదేవీలు జరుపాల్సి ఉంటుంది. కాగా ప్రతి లావాదేవీ కనీసం రూ. 25కు పైగానే వుండాలన్న నిబంధన కూడా వుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more