అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రదాన కార్యదర్శిగా కొనసాగుతున్న వికే శశికళకు బెంగళూరులోని పరప్పనా అగ్రహార కేంద్ర కారాగారంలో నిజంగానే రాజభోగాలు లభిస్తున్నాయా..? అంటే అవునన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మేరకు జైలులోని ఉన్నతాధికారులకు రెండు కోట్ల మేర అందాయని స్వయంగా అదే జైలులో విధులు నిర్వహిస్తున్న జైలు శాఖ డీఐజీ డి రూపా అరోపణలు చేశారు. అయితే వాటిని జైలు అధికారులు ఖండించినా.. ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాత్రం అధికారులను బదిలీ చేసి.. ఘటనపై విచారణకు అదేశించారు.
తాజాగా మరో వీడియో వెలుగుచూడటంతో నిజంగానే శశికళకు జైలులో రాచమర్యాదలు జరిగాయన్న వార్తలు మళ్లీ ఊపందుకున్నాయి. అమెను ఎప్పుడు కావాలంటే అప్పడు, ఎక్కడకు కావాలంటే అక్కడకు వెళ్లే స్వేచ్ఛను, స్వతంత్ర్యాన్ని కూడా అధికారులు కల్పించారన్న విమర్శలు కూడా ఇప్పుడు గుప్పుమంటున్నాయి. ఇందుకు సంబంధించిన జైలు ప్రధాన మార్గంలోని రికార్డయిన సిసిటీవీ ఫూటేజీ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
#WATCH CCTV footage given to ACB by then DIG(Prisons) D Roopa, alleges Sasikala entering jail in civilian clothes in presence of male guards pic.twitter.com/2eUJfbEUjD
— ANI (@ANI) August 21, 2017
నల్లరంగు కుర్తా వేసుకొని చేతిలో బ్యాగు పట్టుకొని శశికళ.. బయటి నుంచి అగ్రహార జైలులోకి దర్జాగా వస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో చిక్కుకోవడమే అవి వైరల్ కావడానికి కారణమైయ్యాయి. దేశ సర్వన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు శశికళకు అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష విధించింది. అయితే, రూ. రెండు కోట్ల మేర లంచాలను ఉన్నాతాధికారులకు చెల్లించి.. జైలులో శశికళ రాజభోగాలు అనుభవిస్తోందని జైళ్లశాఖ డీఐజీ డీ రూప ఆరోపించారు. కాగా ఈ ఘటనలపై ప్రభుత్వం విచారణకు అదేశఇంచడంతో.. రూపా తన ఆరోపణలను సాక్ష్యంగా జైలు ప్రవేశద్వారంలోని సీసీటీవీ కెమెరాలో నమోదైన దృశ్యాలను ఏసీబీకి సమర్పించారు.
సాధారణ దుస్తుల్లో శశికళ జైలు లోపలికి దర్జాగా వస్తున్న దృశ్యాలను ఈ వీడియోలో చూడొచ్చు. ఆమెకు రక్షణగా ఇద్దరు పురుష గార్డులు కూడా ఉన్నారు.శశికళ జైలులో రాజభోగాలు అనుభవిస్తున్నారని ఆరోపించిన డీ రూపను కర్ణాటక ప్రభుత్వం బదిలీచేసిన సంగతి తెలిసిందే. జైళ్ల శాఖ నుంచి ఆమెను తప్పించి బెంగళూరు నగరంలో ట్రాఫిక్ బాధ్యతలను అప్పగించింది. జైలులో శశికళకు రాజభోగాల వ్యవహారంపై ప్రస్తుతం ఏసీబీ దర్యాప్తు జరుపుతోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే సీసీటీవీ కెమెరా దృశ్యాలను డీ రూప సమర్పించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more