వ్యక్తిగత గోప్యత అనేది వ్యక్తుల ప్రాథమిక హక్కేనని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పును వెలువరించింది. ప్రభుత్వం నుంచి పోందే పథకాలన్నింటికీ అధార్ కార్డును అనుసంధానం చేస్తున్నామని, అనుసంధానం చేసుకున్నవారికే పథకాలు వర్తిస్తాయని చెప్పుకోచ్చిన కేంద్రం ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ నేపథ్యంలో 2015లో అధార్ అనుసంఘానంపై వ్యక్తిగత గోప్యతను బహిర్గత పర్చలేమంటూ దాఖలైన పిటీషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఇవాళ కీలక తీర్పు వెల్లడించింది.
అధార్ కార్డులుంటేనే ఏ ప్రభుత్వ పథకమైనా అర్హతలను బట్టి వర్తిస్తుందని గత మూడేళ్లుగా చెప్పుకోచ్చిన కేంద్రం ప్రభుత్వానికి దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు మింగుడుపడకుండా చేసింది. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో తొమ్మిది మంది సభ్యులు గల ధర్మాసనం.. వ్యక్తిగత గోప్యత పౌరుల ప్రాథమిక హక్కు అని కీలక తీర్పును వెలువరించడంతో.. అధార్ కార్డుతో ప్యాన్ కార్టు అనుసంధానంపై సందిగ్దథ ఏర్పడింది. అత్యున్నత న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో ఇక అధార్ కార్డుల అవసరం లకుండానే అర్హులకు ప్రభుత్వ పథకాలు అందనున్నాయి.
ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు తదితర వాటికి ఆధార్ కార్డును కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసిన నేపథ్యంలో వాటిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో ఆధార్ పై విచారించేందుకు ఏర్పాటుచేసిన తోమ్మిది మంది సభ్యులు గల న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం.. ఈ విషయంలో ముందుగా వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కా, కాదా అన్న అంశంపై చర్చ జరిపి.. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనని ఏకగ్రీవ తీర్పును వెలువరించింది. మూడు వారాల్లో ఆరు రోజుల పాటు వాదనలు విన్న ధర్మాసనం ఇవాళ కీలక తీర్పును వెలువరించింది.
కాగా, ప్రభుత్వ పథకాలకు అధార్ కార్డును అనుసంధానం చేయాడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్లపై ఐదుగురు సభ్యులు గత ధర్మాసనం త్వరలో విచారణ చేసట్టనుంది. ప్రభుత్వ పథకాలతో పాటు రాయితీ గ్యాస్ సిలిండర్లకు, ఆహార భద్రత పథకం కింద సరుకులు తీసుకునేందుకు, ఇక ప్యాన్ కార్డుకు, ఇలా అనేక పథకాలకు అధార్ కార్డును కేంద్ర ప్రభుత్వం అనుసంధానించడాన్ని సవాల్ చేస్తూ.. ధాఖలైన పిటీషన్లపై ఐదుగురు సభ్యులు గల ధర్మాసనం విచారించనుంది. ఈ తీర్పుపైనే యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more