కొల్ కతాలో మోడలింగ్ రంగంలో రాణించి.. అక్కడి నుంచి నటిగా రాజస్థాన్ లో అరంగ్రేటం చేసి.. అంధ్రప్రదేశ్ కు వచ్చి నటిగా స్థిరపడుదామనుకుని.. ఎన్నో అశలతో ఎగురుకుంటూ వచ్చి ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో అభియోగాలు ఎదుర్కొని రిమాండ్ ఖైదీగా జీవనాన్ని సాగిస్తున్న సంగీతా చటర్జీ ఇవాళ చిత్తూరు సబ్ జైలులో ఆత్మహత్యకు యత్నించింది. తనకు బెయిలు లభిస్తుందని ఎన్నో అశలు పట్టుకున్నా నిరాశే ఎదురుకావడంతో.. తీవ్ర మనోవేదనకు గురైన సంగీత విషగుళికలు సేవించి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది.
అయితే అమెను సకాలంలో గుర్తించిన జైలు సిబ్బంది.. హుటాహుటిన చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కోల్‌కతాకు చెందిన సంగీత.. ఎయిర్ హోస్టెస్ గా తన కెరీర్ ను ప్రారంభించి.. తర్వాత మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. నటిగా కూడా రాజస్థాన్ ప్రాంతీయ చిత్రాలలో నటించి.. అదృష్టాన్ని పరీక్షించుకున్నా అమెకు కలసిరాలేదు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో నటిగా స్థిరపడాలని కొండంత అశతో వచ్చిన అమెకు ఇక్కడ.. ఎర్రచందనం అక్రమ రవాణా ముఠాలతో పరిచయం ఏర్పడింది.
అది కాస్తా సన్నిహితంగా మారి వివాహానికి కూడా దారి తీసింది. దీంతో లక్ష్మణ్ కు తోడుగా సంగీత కూడా ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడింది. దీంతో చిత్తూరు జిల్లాలో ఆమెపై నాలుగు కేసులు నమోదయ్యాయి. పోలీసులు కోల్‌కతాలో ఆమెపై నిఘా పెట్టి పక్కా ప్రణాళికతో అరెస్ట్ చేసి చిత్తూరు తీసుకొచ్చారు. కోర్టు రిమాండ్ విధించడంతో అప్పటి నుంచి ఆమె చిత్తూరు సబ్‌జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు. బెయిల్ రాకపోవడంతో అమె ఇవాళ విషగుళికలను సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more