మహారాష్ట్రలో కొత్తగా వెలసిన ఓ బాబా తన విచిత్ర వైద్యంతో బాధలను నయం చేస్తున్నారు. ఆ వైద్యాపికి సంబంధించిన వీడియో కాస్తా నెట్టింట్లో పోస్టుకావంతో అది వైరల్ గా మారింది. ఇంతకీ ఈ బాబా గారు చేసే విచిత్ర వైద్యంలో ఏంటో..? దేనికో తెలుసా... దీర్ఘకాలిక నడుం నొప్పితో బాధపడుతున్న వారికి ఈ బాబా వైద్యం చేస్తారు. అంటే లాగి పెట్టి ఒక్కటి పీకి వైద్యం అద్యందంటూ డబ్బు వసూలు చేస్తారా..? అంటే రమారమి అలాగే చేస్తారు. కాకపోతే చెయ్యితో కాకుండా సుత్తితో.. అయితే ఒక్కటి కాకుండా వరుసపెట్టి కనీసం పదిపదిహేను పీకుతారు.
ఔనా.. మరి నడుం వుంటుందా..? ఊడుతుందా..? అనేగా మీ సందేహం. నడుం నోప్పితో వచ్చే బాధితులకు ఇట్టే పరిష్కార మార్గం చూపిస్తానంటూ తనదైన శైలిలో వైద్యం చేస్తున్న ఈ బాబా వద్ద వైద్యం చేయించుకునేందుకు దూరప్రాంతాలకు చెందిన వచ్చిన జనం బారులు తీరుతున్నారు. అేదంటి అంటే ఖరీదైన కార్పోరేట్ వైద్యం చేయించుకునే స్థోమత లేక.. జన ప్రచారంతో సుత్తి వైద్యం వెలుగులోకి రావడంతో ఈయనగారి వద్దకు బాధితులు క్యూకట్టి మరీ వైద్యం చేయించుకుంటున్నారు.
ఇంతకీ ఆయన ఏ మందో మాకో ఇచ్చి నడుం నొప్పిని దూరం చేస్తున్నారనుకుంటే పప్పులో కాలేసినట్లే.. సుత్తితో గట్టిగా వెన్నుపూసపై కొడుతూ నొప్పిని తగ్గిస్తారట.. అంతేకాదు ఈ వైద్యుడి గురించిన పూర్తి వివరాలు మాత్రం తెలియరాలేదు. ఆయనది ఏ గ్రామం. ఎక్కడ వైద్యం చేస్తున్నారు.. ఎన్నేళ్లుగా ఈ వైద్యం చేస్తున్నారు.. అసలు ఆయన పేరేంటి అన్న విషయాలు కూడా తెలియరాలేదు. కాగా ఇలాంటి నాటు వైద్యం మాత్రం అతంత ప్రమాదకరమని అర్థోపిడీషియన్లు చెబుతున్నారు. సుత్తితో కొడుతూ చేస్తున్న ఈ నాటు వైద్యం భవిష్యత్తులో తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఇలాంటి నాటు వైద్యం చేసే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ కూడా పెరుగుతుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more