AIADMK Decides to Expel Sasikala, 'Reclaim' Jaya TV అన్నాడీఎంకే నుంచి శశికళ, దినకరణ్ బహిష్కరణ

Aiadmk decides to expel sasikala reclaim jaya tv

palaniswamy, AIADMK meet, Sasikala, Dinakaran, Tamil Nadu, Panneerselvam, Jaya TV, Jayalalithaam Jaya TV, sasikala expelled from party

The AIADMK decided to expel party chief VK Sasikala and scrap all appointments made by her, escalating a battle for control of the ruling party by a group led by Tamil Nadu chief minister E Palaniswami.

అన్నాడీఎంకే నుంచి శశికళ, దినకరణ్ బహిష్కరణ

Posted: 08/28/2017 03:11 PM IST
Aiadmk decides to expel sasikala reclaim jaya tv

తమిళనాడులోని పళనిస్వామి ప్రభుత్వానికి మరో మారు గట్టి షాక్ తగిలింది. పార్టీ ఉనికికే ప్రమాదం సంభివిస్తుందని సందర్భంలో ఏర్పాటు చేసిన అత్యంత కీలకమైన సమావేశానికి తన వర్గానికి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరుకావడంతో ఆయన పైకి గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా.. లోలోన మాత్రం అందోళన చెందుతున్నట్లే వుంది. ఇప్పటికే పన్నీరువర్గంతో తాను చేరడాన్ని వ్యతిరేకిస్తూ 19 మంది ఎమ్మెల్యేలు టీటీవీ దినకరణ్ శిబిరంలో చేరిపోగా.. ఇక అత్యంత కీలకమైన సమావేశానికి 40 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడంతో పళనిస్వామి ప్రభుత్వం చిక్కుల్లో పడినట్లైంది.

దినకరణ్ జట్టుగా విడిపోయినా 19 మంది ఎమ్మెల్యేలు ఆయన పంచన చేరి.. పుదుచ్చేరిలోని రిసార్టు సేద తీరుతుండగా, ఆ తరువాత మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా అదే బాటలో పయనించారు. ఇలా ఒక్కో ఎమ్మెల్యే తన జట్టు వీడటంతో ఇప్పటికే తీవ్ర కష్టాలలో పడిన పళని సర్కార్.. ఇక ఇవాళ్టి మీటింగ్ కు 40 మంది ఎమ్మెల్యేలు డుమ్మాకోట్టిన నేపథ్యంలో తమిళనాట రాజకీయాలు ఒక్కసారిగా అసక్తికరంగా మారాగా, ఇటు అధికారవర్గంలో మాత్రం అందోళన తారాస్థాయికి చేరుతోంది. అయినా వచ్చిన ఎమ్మెల్యలతో చర్చించి పన్నీరు సెల్వం నేతృత్వంలో పార్టీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

రొయపెట్టాలో జరిగే పార్టీ సర్వ సభ్య సమావేశంలో పార్టీ కన్వీనర్ పన్నీరు సెల్వం సహా ఉప కన్వీనర్ పళనిస్వామిలు నేతృత్వంలో తొలిసారిగా సమావేశమైన ఎమ్మెల్యేలు.. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి వీకే శశికళను బహిష్కరిస్తూ ఆ తీర్మానం చేసింది. అంతేకాదు అమె చేపట్టిన పార్టీ నియామకాలన్నీ రద్దు చేసున్నట్లు ప్రకటించింది. శశికళతో పాటు ఆమె మేనల్లుడు టిటివి దినకరన్ ను అన్ని పార్టీ పదవుల నుంచి బహిష్కరిస్తూ తీర్మానాన్ని ఆమోదించారు. త్వరలో పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించి వీరి బహిష్కరణను అధికారికంగా ఆమోదించనున్నట్టు వెల్లడించారు. ఇక జయ టివీతో పాటు నమతు ఎంజీఆర్ మేగజైన్లను కూడా ఇకపై పార్టీ ద్వారానే నిర్వహించాని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు రొయపెట్టాలో జరిగే పార్టీ సర్వ సభ్య సమావేశానికి తమకు ఆహ్వానం అందలేదని.. తామంతా దినకరన్‌ వెంటే నడుస్తామని ఎమ్మెల్యే తంగ తమిళసెల్వన్‌ స్పష్టం చేశారు. DMKకేకు మద్ధతుగా వ్యవహరించబోతున్నారన్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. పళని-పన్నీర్‌ వర్గంలో మరింత మంది స్లీపర్‌ సెల్స్ ఉన్నారని.. వారంతా త్వరలో దినకరన్‌ గూటికి చేరతారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్‌ పారదర్శకంగా వ్యవహరించి అసెంబ్లీలో బలనిరూపణ పరీక్ష నిర్వహిస్తారని ఆశిస్తున్నామన్నారు. లేని పక్షంలో రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని సెల్వన్‌ కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : palaniswamy  AIADMK meet  Sasikala  Dinakaran  Tamil Nadu  Panneerselvam  Jaya TV  Jayalalithaa  

Other Articles