అక్కడ జరుగుతుంది ఓ అందోళన. తమకు న్యాయం చేయాలని విద్యార్థి లోకం రోడ్డెక్కి.. నిరసన తెలుపుతోంది. అసలే విద్యార్థులు.. ఏ క్షణం ఉద్యమం ఏ రూపు దాలుస్తుందో తెలియని ఉత్కంఠకర పరిణామంలో ఓ పోలీసు ఉన్నతాధికారి మాత్రం దొరికిందే అదనుగా తనలోని చీకటి కోణాన్ని పబ్లిక్ గా బట్టబయలు చేశారు. నీట్ పరీక్షను రద్దు చేయాలంటూ తమిళనాడులోని విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమిళానాడులోని కోయంబత్తూరులో భారీ ఎత్తున ఆందోళనకారులు గుమికూడటంతో పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
ఆందోళనను విరమింపజేయాలని ఆందోళనకారులను పోలీసులు వినతి చేసినా ఫలితం లేకపోయింది. వేడి రక్తం మరుగుతున్న విద్యార్థులు పోలీసుల వినతులతో మరింతగా రెచ్చిపోయి నినాదాలు చేయడం ప్రారంభించారు. దీంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అదికాస్తా క్రమంగా తోపులాటకు దారి తీసింది. దీంతో పరిస్థితిని అదుపు చేయడం కోసం పోలీసులు విద్యార్థులను చెదరగోట్టేందుకు చర్యలు చేపట్టారు. అయినా విద్యార్థులు పోలీసుల చర్యలతో చలించకపోగా.. మరింతగీ పోలీసులపైకి తోసుకువచ్చారు.
దీంతో పోలీసులు వారిని కంట్రోల్ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇదే పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకున్న ఓ పోలీసులు ఉన్నతాధికారి.. తన కింది స్థాయి మహిళా పోలీసు అధికారిని పట్ల అసభ్యంగా వ్యవహరించాడు. పబ్లిక్ గా విద్యార్థినీవిద్యార్ధుల మధ్య.. బావితరానికి ఏదైతే చేయకూడదని చెబుతామో అదే చేసి చూయించి తన కాకీ డ్రెస్ మాటును వున్న కీచకుడ్ని తట్టిలేపి.. మహిళా ఎస్ఐపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దృష్యాలు అక్కడి కెమెరాలలో చిక్కడంతో మన ఏసీపీ ముసుగులో వున్న కామాంధుడు వైరల్ గా మారాడు.
కోయంబత్తూరు అసిస్టెంట్ కమాండెంట్ అప్ పోలీసుగా విధులు నిర్వహిస్తున్న అధికారి రెడ్ హ్యాండెండ్ గా కెమెరాకు చిక్కాడు. మహిళా కానిస్టేబుల్‌పై చెయ్యేసి తన పని కానిచ్చాడు. పోలీస్ అధికారి మహిళా కానిస్టేబుల్ ను లైంగికంగా వేధించాడు. ఆమెపై చెయ్యేసి అసభ్యంగా ప్రవర్తించసాగాడు. అమె తీరా చూస్తే అతను తనకన్నా ఉన్నతాధికారి. దీంతో ఏమీ అనలేకపోయింది. తాకరాని చోట ఏసీపీ తాకుతున్నా మౌనంగానే అతని చెయ్యిని తన చేతితో తోసేసింది. అయినా పోలీస్ ఆధికారి ఏమాత్రం తగ్గకుండా ఆమెను పదే పదే వేధించాడు. ఆ వీడియో మీరు చూడండీ..
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more