సోషల్ మీడియాలో కార్పొరేటర్ కుమారుడి వీడియో హల్చల్ చేస్తోంది. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే దేవుళ్లు అన్న సిద్దాంతాన్ని మర్చారు.. ప్రజలు ఓట్ల వేసి గెలిపిస్తేనే తాము అధికారికంగా పదవులలో కొనసాగుతున్నామన్న కనీస ఇంకితం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. అధికారికంగా పదవులు లభిస్తే అవి కిరీటాలుగా భావిస్తున్నారే కానీ, అసలు అవి తమను ప్రజలకు సేవకులుగా మారుస్తున్నాయన్న విషయాన్ని మర్చపోతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఓ సారి ఓ రాజకీయ నాయకుడి వారసుడి కుమారుడు చేసిన తప్పుకు తండ్రే క్షమాపణలు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినా.. ఆ తనయుడిలో మాత్రం మార్పు రాలేదు.
తాజాగా సదరు రాజకీయ నాయుకుడి కుమారుడు సాగించిన దౌర్జన్యకాంఢ వెలుగులోకి రావడంతో.. అటు సోషల్ మీడియాలో హైలైట్ కావడంతో బాధితుడు పోలీసులను అశ్రయించి పిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. కూకట్ పల్లి హౌజింగ్ బోర్డు (ఆల్విన్ కాలనీ) కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ కుమారుడు రామకృష్ణ గౌడ్ తన స్నేహితులతో కలిసి భాగ్యనగర్ కాలనీలో మద్యం తాగేందుకు ఓ బార్ కు వచ్చాడు. అదే సమయంలో ఆ పక్కనే ఉన్న టిఫిన్ సెంటర్ కు హేమంత్ కుమార్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి వచ్చాడు.
అయితే టిఫిన్ సెంటర్ వెళ్లేందుకు తన కారు అడ్డంగా వున్న రామకృష్ణ కారును తీయాల్సిందిగా హేమంత్ అతన్ని కోరాడు. దీంతో అగ్రహానికి గురైన రామకృష్ణ గౌడ్.. నన్నే కారు పక్కకు తీయమంటావా..? నేనెవరో తెలుసా..? అంటూ హేమంత్, అతని స్నేహితులను చితకబాదాడు. అకస్మాత్తుగా అలజడి సృష్టించి.. దాడికి పాల్పడిన రామకృష్ణ గౌడ్ సహా అతని స్నేహితులను అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నించారు. అయితే వారిపై కూడా వీరి దౌర్జన్య కాండ కొనసాగింది.
ఈ తతంగాన్నంతా అక్కడే వుండి.. గోడవల్లో తలదూర్చడం ఇష్టంలోని కొందరు నేతల కుమారులు సాగించే అరాచకం ఎలావుంటుందో అనేందుకు సాక్ష్యంగా వీడియో తీసి.. దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఈ నెల 5న ఈ ఘటన జరగ్గా.. ఈ దౌర్జన్యకాండకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన నేపథ్యంలో యావత్తు ఘటన వెలుగుచూసింది. దీంతో బాధితుడు హేమంత్ కుమార్ పోలీసు స్టేషన్ కు వెళ్లి రామకృష్ణ గౌడ్ పై పోలీసులకు పిర్యాదు చేశాడు. కాగా సిసిటీవీ ఫూటేజీ అధారంగా నలగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చి తరువాత విడుదల చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more