అగ్రరాజ్యం అమెరికాపై ప్రకృతి కూడా పగబట్టినట్లు వుంది. ఓ వైపు ఇర్మా సహా మరో రెండు హరికేన్లు తమ ప్రకోపాన్ని చాటుతుండగానే ఇటు మెక్సికో నగరంపై కూడా విలయతాండవం చేయడంతో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుకుపోతుంది. అత్యంత శక్తిమంతమైన భూకంపం మెక్సికో తీర ప్రాంతాలను అతలాకుతలం చేయడంతో ఇప్పటి వరకు 61 మంది ప్రాణాలు కోల్పోయారు. 200 మందికి పైగా గాయపడ్డారు. అనేక భవనాలు నేలమట్టమయ్యాయి.
మూడు దశాబ్దల క్రితం ఇంతకంటే తీవ్ర ఉధృతితో కంపించిన భూమి ఏకంగా 5 వేల మందిని బలితీసుకున్న గుర్తులను మెక్సికో వాసుల కళ్లముందు మెదిలాయి. భూకంపం ధాటికి తీవ్రంగా నష్టపోయిన టబాస్కో, ఒయాక్సాకా, చియపస్ రాష్ట్రాల్లో భారీ ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండగా.. వారిని రక్షించేందుకు సహాయక సిబ్బంది తీవ్రంగా యత్నిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
అమెరికాకు, సెంట్రల్ అమెరికాకు మధ్యనున్న మెక్సికో దేశంలో భూకంపం ధాటికి అనేక మంది మరణించిన నేపథ్యంలో ఈ రోజు సంతాప దినంగా ప్రకటించారు అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నియెటో. మృతులకు నివాళిగా దేశ జెండాలను అవతనం చేశారు. ఒక్క ఒయక్సాకాలోనే 45 మంది మృతిచెందగా.. చియపస్లో 12 మంది, టబాస్కోలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కాగా.. ఈ ప్రకంపనలు పొరుగునే ఉండే గ్వాటెమాలా వరకు వ్యాపించాయి. గ్వాటెమాలాలో కూడా ఒకరు చనిపోయినట్లు సమాచారం.
మెక్సికో దక్షిణ తీరంలో చియపస్ రాష్ట్రంలోని పిజిజియపన్ పట్టణానికి 87 కిలోమీటర్ల దూరంలో, పసిఫిక్ మహాసముద్రంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాగా రెక్టారు స్కేలుపై దీని తీవ్రత 8.2గా నమోదైంది. అయితే ఈ ప్రాంతవాసులకు ప్రకంపనలు కొత్త కాదు. ఏడాదిలో పలు పర్యాయాలు ఇక్కడ భూమి కంపిస్తుంది. దీంతో అధికారులు ఈ ప్రాంతవాసులను నిత్యం అలెర్టుగా వుంచేందుకు భూకంప డ్రిల్ ను కూడా నిర్వహిస్తారు. భూకంపం వస్తుందన్న తరుణంలో వారికి అలారమ్ కు మోగుతాయి. ఇంత జాగ్రత్తగా వున్న పదుల సంఖ్యలో ప్రాణాలు మాత్రం పోయాయి. భూకంపం ధాటికి 3.3 అడుగుల ఎత్తున అలలు ఎగసిపడ్డాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. లక్షల సంఖ్యలో జనంపై ఈ భూకంపం ప్రభావం చూపించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more