manager arrested for molesting sales girl సేల్స్ గర్ల్ పై మేనేజర్ అత్యాచారం..

Manager arrested for molesting sales girl in bangalore

sweetshop manager molests sales girl, kora sweer shop manager arrested, kora mangala sweer shop manager arrested, rk garden, Ravi Kumar, neelasandra kumar, Neelasandra, Kumar, Koramangala, Kora, Bengaluru. karnataka, crime

A 36-year-old-manager of a ­reputed sweet shop in Kora­ma­ngala has been arrested for allegedly raping a sales girl.

సేల్స్ గర్ల్ పై మేనేజర్ అత్యాచారం..

Posted: 09/11/2017 03:46 PM IST
Manager arrested for molesting sales girl in bangalore

అరచేతిలో వైకుంఠం చూపి ఆశల పల్లకిలో తేలియాడేలా చేసి.. తన అవసరాలను తీర్చుకున్న తరువాత రంగులు మార్చే ఊసరవెళ్లిలా.. మాటమార్చిన నయవంచకుడ్ని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. తన భార్యకు సంతానం కలగడం లేదన్న కారణంగా అమెకు విడాకులు ఇచ్చానని నమ్మబలికిన ఓ మేనేజరు.. తన సహోద్యోగిని పెళ్లిపేరుతో వంచన చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. అమె నెలతప్పడానికి కారకుడు కావడంతో .. బాధితురాలి పిర్యాదు మేరకు పోలీసులు మేనేజరుకు అరదండాలు విధించారు.

వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరు నగరంలోని నీలాసాంధ్ర ప్రాంత పరిధిలోని ఆర్కేగార్డెన్ కు చెందిన రవికుమార్ (36) ఓ ప్రముఖ మిఠాయి దుకాణంలో మేనేజరుగా విధులు నిర్వహిస్తున్నాడు. అదే దుకానంలో పది నెలల క్రితం సెల్స్ గర్ల్ గా చేరిన ఓ యువతిని చూసి అమెతో పరిచయం పెంచుకున్నాడు. అమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ఏకంగా యువతి ఇంటికి వెళ్లి అమె తల్లిదండ్రులను కూడా ఈ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు.

యువతికి వీక్లీ అఫ్ వున్న రోజున.. తన భార్యను బయటకు పంపించి.. యువతిని తన నివాసానికి తీసుకువచ్చి అమెతో అవసరం తీర్చుకున్నాడు. దీంతో యువతి గర్భందాల్చింది. తనను పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేసింది. దీంతో ప్లేటు ఫిరాయించిన మేనేజరు తాను తన భార్యకు విడాకులు ఇవ్వలేదని, విడాకులు ఇచ్చిన తరువాత వివాహం చేసుకుంటానని చెప్పాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధిత యువతి రవికుమార్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడ్నిఅరెస్టు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rk garden  Ravi Kumar  neelasandra kumar  Neelasandra  Kumar  Koramangala  Kora  Bengaluru. karnataka  crime  

Other Articles