Uttarakhand education minister insults female teacher మంత్రి మాథ్స్ పరువు తీసింది.. వీడియో వైరల్

Uttarakhand education minister gets his own maths wrong

uttarakhand, uttarakhand education minister, arvind pandey, minister wrong maths, minister insult maths teacher, uttarakhand minsiter insult teacher, Education Department, Education Minister Arvind Pandey, School Inspection, question answer, surprise inspection, viral videos, latest news

Minister Arvind Pandey asked the teacher simple equation from Chemistry, asking her what would be the answer for "minus plus minus.

ITEMVIDEOS: ఈయన మరో మంత్రి.. ‘‘కెమిస్ట్రీలో మైనస్ ప్లస్ మైనస్’’

Posted: 09/16/2017 01:34 PM IST
Uttarakhand education minister gets his own maths wrong

కామర్స్ లో ఫిజిక్స్, మాధ్స్ వుంటాయి కాబట్టి వాటిని తాను ఇష్టంగా చదివానని చెప్పి తనంతటతానుగా పరువు తీసుకున్న టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఉదంతాన్ని మర్చిపోకముందే మరో మంత్రవర్యులు ఏకంగా కెమిస్ట్రీలో మైనస్ ప్లప్ మైనస్ ఎంత అని స్వయంగా ఉపాధ్యాయురాలినే ప్రశ్నించి.. తన పరువును చేజేతులా అబాసుపాలు చేసుకున్నారు. ఈ ఉదంతం ఉత్తరాఖండ్ లో జరిగింది.

అయితే ప్రభుత్వ పాఠశాలల్లోవున్న టీచర్లకు ఏమీ రాదని రుజువు చేసేందుకు ప్రయత్నించాలనుకున్నారా..? లేక విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయాలనుకున్నారా తెలియదు కానీ.. విద్యాశాఖ మంత్రి వచ్చారన్న తమ పాఠశాలకు వచ్చారన్న సంతోషం అక్కడి విద్యార్థులతో పాటు ఉపాధ్యయులలో కూడా ఎక్కువ సేపు నిలవలేదు. వచ్చి రాగానే ఆయన ఓ టీచర్‌కు పరీక్ష పెట్టి.. అమె చెప్పది వినకుండానే తప్పని తీవ్రంగా అవమానించడమే ఇందుకు కారణమైంది.

వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్‌ విద్యాశాఖమంత్రి అరవింద్‌ పాండే గత కొన్నాళ్లుగా పాఠశాలల్లో అకస్మాత్తుగా సందర్శిస్తున్నారు. వచ్చిరాగానే ఆ స్కూల్‌లోని గణితం బోధిస్తున్న టీచర్‌కు పరీక్ష పెట్టారు. కెమిస్ట్రీలో నంుచి ప్రశ్న అడుగుతానని మైనస్ ప్లస్ మైనస్ ఎంత అని అడిగిన మంత్రివర్యులు.. టీచర్ మైనస్ అని చెప్పిన సమాధానాన్ని తప్పుగా తేల్చేశారు. ఇక గణితంలోంచి మరో ప్రశ్నను అడిగిన అయన మైనస్‌ ఒకటి ప్లస్‌ మైనస్‌ ఒకటి ఎంత ప్రశ్నించారు.

దాని సమాధానం మైనస్‌ రెండుకాగా, అందరి సమక్షంలో మంత్రి సున్నా అని సమాధానం చెప్పి తన పరువును తానే తీసుకున్నారు. అక్కడితో అగకుండా తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్లు అన్న తరహాలో వాధించారు. అప్పటికీ మంత్రివర్యుల అవేశం తగ్గినట్లు లేదు.. అందుకనూ సదరు మహిళా ఉపాధ్యయురాలిని ఓ వారంపాటు సస్పెండ్ చేశారు. దీంతో ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర విమర్శలు చేశాయి. తన తప్పను సమర్థించుకునేందుకు మంత్రివర్యులు మరో అడుగుముందుకేశారు. టీచర్ ప్రభుత్వ ప్రచురణ పుస్తకం కాకుండా గైడ్‌ చూసి పాఠశాలు చెబుతున్నారంటూ తప్పించుకునే యత్నం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uttarakhand  Education Minister  Arvind Pandey  lady teacher  viral videos  latest news  

Other Articles