తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. రోజుకో మలుపు తిరుగుతూ.. శరవేగంగా మార్పులు సంతరించుకోవడంతో.. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం వుందా..? లేదా..? వుంటే వారి వ్యూహాలు, ప్రతివ్యూహాలలోనే తనమునకలై వుంటింది.. కానీ ప్రజా సమస్యలు మాత్రం పట్టవు.. అయినా ప్రభుత్వమే మనుగడ సాగిస్తుందా..? లేదా..? అన్న స్థాయిలో ప్రత్యర్థి పార్టీలు పావులు కదుపుతుంటే.. అధికారంలో ఎవరున్నా.. మాత్రం ప్రజాసేవ కోసం ఎలా అలోచిస్తారు.
నిన్న తమిళనాడు స్పీకర్ ధన్ పాల్.. టిటీవీ దినకరణ్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన నేపథ్యంలో.. న్యాయపోరాటానికి దిగుతామన్న ఆ వర్గం ఎమ్మెల్యేలు అన్నంత పని చేశారు. మద్రాసు హైకోర్టులో స్పీకర్ ధన్ పాల్ తమపై అనర్హత వేటు వేయడాన్ని సవాల్ చేశారు. ఈ పిటీషన్ ను అత్యవసర పరిస్థితుల కింద పరిగణించిన న్యాయస్థానం రేపు (బుధవారం) దీనిపై విచారణను చేపట్టనున్నట్లు తెలిపింది. కాగా ఈ నెల 21న తమిళనాడులోని పళని స్వామి ప్రభుత్వం అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోనుంది.
సరిగ్గా విశ్వాస పరీక్షకు వెళ్లనున్న తరుణంలో.. రాష్ట్ర ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు కూడా రాష్ట్రానికి వచ్చిన నేపథ్యంలో అదను చూసి పళిని స్వామి ప్రభుత్వం.. వ్యూహాత్మకంగా అడుగువేసి టీటీవీ ధినకరణ్ కు మద్దతిస్తున్న 18 మంది ఎమ్మెల్యేలపై వేటు వేసిన విషయం తెలిసింది. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ దన్ పాల్ పార్టీ విప్ ధిక్కరించిన 18 మంది ఎమ్మెల్యేను అనర్హులుగా ప్రకటించారు. పార్టీ నిర్ణయాలకు కట్టబడి వ్యవహరించకుండా.. వ్యతిరేక చర్యలకు పాల్పడినందుకు.. స్పీకర్ జారీ చేసిన నోటీసులకు బదులు కూడా ఇవ్వని నేపథ్యంలో వీరిపై చర్యకు పూనుకున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే
కాగా, శశికళ వర్గాన్ని కోలుకోకుండా చేసే క్రమంలో పళని వర్గం వ్యూహాత్మకంగా తీసుకున్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటు నిర్ణయం కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పి. చిదంబరం తప్పుబట్టారు. 18 మంది ఎమ్మెల్యేలు ఒక వర్గంగా ఏర్పడ్డటంతో వారిపై వేటు వేయడాన్ని ఆయన తోసిపుచ్చారు. ఇది స్పీకర్ తీసుకున్న అనాలోచిత నిర్ణయంగా చెప్పారు. దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వం మైనారిటీలోకి జారుకుని.. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు దోహదపడుతుందన్నారు. మునిగిపోయే పడవను ఎవరు మాత్రం కాపాడగలరని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ మొత్తం వ్యవహరంపై స్పందించాల్సిన గవర్నర్ నిశ్చేష్టులుగా వుండగా, సహనంతో ఎదురుచూడాల్సిన స్పీకర్ మాత్రం చర్యలకు ఉపక్రమించారని చిదంబరం పేర్కోన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more